By: ABP Desam | Updated at : 16 Dec 2021 02:15 PM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Star Maa/Hotstar
బుల్లితెరపై దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఐదో సీజన్ ఈ వీకెండ్ తో పూర్తి కాబోతుంది. చివరి వారం కావడంతో పెద్దగా టాస్కులు, గొడవలు హడావుడి లేకుండా సాగుతోంది. వారంలో మొదటి మూడు రోజులు ఇంటి సభ్యులకు జర్నీ చూపించారు. జర్నీ వీడియోలను చూపించే క్రమంలోనే బిగ్ బాస్ నిర్వహకులు ఆయా కంటెస్టెంట్లకు సంబంధించిన ఫొటోలను కూడా ఉంచారు. ఇక, ఆ వీడియోలు చూపించిన తర్వాత ప్రతి కంటెస్టెంట్ రెండు ఫొటోలు తీసుకుని.. అందులో ఒకదాని గురించి అందరితో పంచుకోవాలని.. ఆ ఫొటోపై ఏదైనా తమకు తోచిన సందేశాన్ని రాసి బిగ్ బాస్‌కు తిరిగి ఇచ్చేయాలన్నారు. ఈ టాస్కులో భాగంగా కంటెస్టెంట్లు అందరూ తమ మనసులోని భావాలను మిగిలిన ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులతో పంచుకున్నాక ఆయా ఫొటోలపై కొన్ని కొటేషన్స్ రాసి బిగ్ బాస్‌కు తిరిగి ఇచ్చేశారు. ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఈరోజు ఫన్నీ టాస్కులు ఇచ్చారు. లేబుల్ లేదు మచ్చా అంటూ గతంలో ఓ టాస్క్ లో భాగంగా సన్నీ చేసిన హడావుడిని టాస్క్ గా ఇచ్చారు. ఇందులో మానస్, షణ్ముక్ పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత ఇచ్చిన టాస్క్ ని ఇంటి సభ్యులు బాగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తున్నారు. గతంలో హెలికాఫ్టర్, ట్రాక్టర్ సౌండ్స్ విషయంలో కన్ఫ్యూజ్ అయిన సిరిని ఆటపట్టించారు. FROG బదులు FORG అని రాసిన సన్నీని ఫ్రాగ్ స్పెల్లింగ్ చెప్పమనడంతో హౌస్ అంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది. మొత్తంగా మొదటి వారం నుంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్న హౌస్ మేట్స్ ఆఖరి వారం ఫన్ లో ఉన్నారు.
Label ledu macha...Sound cheppu chicha #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun #BiggBossTelugu5 pic.twitter.com/fPgqc3hLad
— starmaa (@StarMaa) December 16, 2021
భారీ అంచనాల నడుమ మొదలైన ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు టైటిల్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ వారం మొదటి నుంచే వీజే సన్నీ ఓటింగ్‌లో మొదటి స్థానంలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. షణ్ముఖ్ జస్వంత్ రెండో స్థానంలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.ఈ సీజన్ ఆరంభం నుంచి చక్కని ఆటను కనబరచడంతో పాటు అన్ని రకాలుగా ప్రేక్షకులను మెప్పించిన వారిలో సింగర్ శ్రీరామ చంద్ర ఒకడు. టికెట్ టు ఫినాలే గెలుచుకుని అందరి కంటే ముందే ఫైనల్స్‌లో అడుగు పెట్టాడతను. ఇక, మొదటి రోజు ఓటింగ్‌లో శ్రీరామ్ మూడో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. మానస్ మాత్రం నాలుగో స్థానంలో, సిరి హన్మంత్ ఐదో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరి టైటిల్ విజేత ఎవరో వెయిట్ అండ్ సీ...
Also Read: వసుధార కౌంటర్లకి విలవిల్లాడుతున్న ఇగోమాస్టర్ రిషి.. వసుని చూసి మురిసిపోతున్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 16 గురువారం ఎపిసోడ్
Also Read: 'సంచారి'... 'రాధే శ్యామ్' నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది!
Also Read: 'లైగర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రౌడీ బాయ్! ప్రభాస్ సినిమా వెనుక...
Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: అక్కడ తెలుగు సినిమాలు చూడటం 'ఆర్య'తో మొదలుపెట్టారట... అలాగే మీడియాకు సారీ
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Allu Aravind: అది ఆయన ఫెయిల్యూర్, మా కుటుంబంలో ఎవరికీ పీఆర్వో కాదు: ‘సంతోషం’ వివాదంపై అల్లు అరవింద్ కామెంట్స్
Animal Deleted Scene: ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ‘యానిమల్’ డిలీటెడ్ సీన్ - ఎందుకు డిలీట్ చేశారంటూ వాపోతున్న ఫ్యాన్స్!
Bobby Deol: కలలా అనిపిస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్న ‘యానిమల్’ విలన్ బాబీడియోల్
Bigg Boss 7 Telugu: SPY vs SPA - నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చావా? శోభా నామినేషన్‌కు శివాజీ కౌంటర్
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
CMD Prabhakar Rao Resign: ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా
/body>