Bigg Boss 5 Telugu : నాకు అన్యాయం చేస్తారా.. ఇక బయట నుంచి దమ్‌ దమ్‌ చేస్తా చూస్కోరి.. బిగ్‌బాస్‌కు సరయు వార్నింగ్

బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సరయు మొదటి వారంలోనే బయటకు వచ్చేసింది.

FOLLOW US: 

బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సరయు మొదటి వారంలోనే బయటకు వచ్చేసింది. అయితే వచ్చే ముందు హౌస్ మేట్స్ చాలా మందిపై నెగెటివ్ కామెంట్స్ చేసింది. సిరి-షణ్ముఖ్ బయట అనుకొని హౌస్ లోకి వచ్చారని.. షణ్ముఖ్ కి ఒంటరిగా ఆడడం చేతకాదని.. అలాంటప్పుడు గాజులేసుకొని మూలన కూర్చోవాలంటూ మండిపడింది. ఈ వ్యాఖ్యలతో హర్ట్ అయిన షణ్ముఖ్ అభిమానులు సరయుపై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేశారు. ఈ విషయాలన్నింటి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పింది. 

తొలివారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో పోటీదారులు తొక్కే సైకిల్ లైట్ వెలుగుతుందా..? లేదా..? అని చూడడానికి వారి ముందు అద్దాలు పెట్టారు. టాస్క్ మధ్యలో సిరి, షణ్ముఖ్ లు సైగలు చేసుకున్నారని.. దీంతో షణ్ముఖ్ వెంటనే హమీదాకు సైకిల్ లైట్ కనిపించకుండా ఆమె ముందు నిల్చున్నాడని.. తనకు లైట్‌ కనిపించట్లేదని హమీదా చెప్పడంతో అక్కడి నుంచి జరగమని షణ్నూకు పలుమార్లు సూచించినా.. అతడు మాత్రం కదల్లేదు. షణ్ముఖ్ దొంగచాటుగా గేమ్ ఆపడానికి ప్రయత్నించాడని మండిపడింది సరయు. 

నేను కెప్టెన్ అవ్వాలనుకోలేదని ఏడ్చి డ్రామా చేసిన సిరి.. 'ఫస్ట్ కెప్టెన్ నేనే అవుతానంటూ బాయ్ ఫ్రెండ్ కు చెప్పి వచ్చానని అందరి ముందే గట్టిగా అరిచి చెప్పిందంటూ' సరయు గుర్తు చేసుకుంది. కానీ అది మాత్రం టెలికాస్ట్ అవ్వలేదని చెప్పింది. లోబోను రవి.. ముళ్లపంది అన్నాడని.. దానికి లోబో హర్ట్ అయ్యాడని.. తనను ఎలిమినేట్ చేసి పంపించేయమని ఏడ్చినట్లు చెప్పింది. ఆ సమయంలో లోబోకి తను ధైర్యం చెప్పినట్లు.. లోబోతో కలిసి తను కామెడీ చేస్తే రవి చూడలేకపోయేవాడని సరయు చెప్పింది. నాగార్జున సర్ బూతులు మాట్లాడమని చెప్పినప్పటికీ.. బిగ్ బాస్ షోను ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారని బూతులు మాట్లాడలేదని చెప్పింది. కానీ సిగరెట్ తాగితే ఇంత సీరియస్ గా తీసుకుంటారనుకోలేదని ఏడ్చేసింది.  

ఒకవేళ మళ్లీ బిగ్ బాస్ షో నుంచి పిలుపు వస్తే వెళ్తారా..? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. తను బిగ్ బాస్ కు అన్ ఫిట్ అని చెప్పింది. ఒకవేళ మళ్లీ వెళ్లినా.. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తానని.. ఎందుకంటే స్క్రీన్ స్పేస్ దొరుకుతుందనే గ్యారెంటీ కూడా లేదని చెప్పింది. బిగ్ బాస్ తనపై పక్షపాతం చూపించారని.. అన్యాయం చేశాడని బాధపడింది. తనను ఎక్కువగా నెగెటివ్ గా చూపించారని.. తన విషయంలోనే ఇలా ఎందుకు చేశారని బిగ్ బాస్ ప్రశ్నించింది. 

Published at : 15 Sep 2021 08:26 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 Bigg Boss Sarayu Bigg Boss 5 sarayu

సంబంధిత కథనాలు

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

టాప్ స్టోరీస్

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి