అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ తిరిగి పొందేందుకు బిగ్ బాస్ ఇంట్లో రకరకాల టాస్క్ లు జరుగుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ మరో ‘బాంబ్’ పేల్చాడు.

బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ రివైవ్ టాస్క్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కోత పడిన డబ్బులు తిరిగి పొందేందుకు బిగ్ బాస్ ఇంటి సభ్యులకి రకరకాల టాస్క్ లు ఇస్తూ వస్తున్నారు. గత ఎపిసోడ్లో దెయ్యాల టాస్క్ ఇస్తే ఈరోజు ఏకంగా ఇంట్లో బాంబ్ పెట్టేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు.

తాజా ప్రోమో ప్రకారం.. బిగ్ బాస్ శ్రీసత్యని చీకటిగా ఉన్న కన్ఫెషన్ రూంకి పిలిచారు. కీర్తి తనని లోపలికి పంపించడానికి ట్రై చేస్తుంటే సత్య భయమేస్తుందని తెగ అల్లరి చేసింది. తనతో పాటు తోడుగా ఎవరినైన పిలవమని లేకపోతే రానని గది బయటే కూర్చుంది. తన పేరు చెప్తే ప్లేట్ తీసుకుని కొట్టేస్తానని శ్రీహాన్ అనడం ఫన్నీగా ఉంది. ఎందుకంటే ఆదిరెడ్డికి ఇచ్చిన టాస్క్ లో భాగంగా శ్రీహాన్ ఒకసారి చీకటి గదిలోకి వెళ్ళి భయపడుతూ నానా హంగామా చేశాడు. మళ్ళీ బిగ్ బాస్ శ్రీసత్యని కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మంటే “అమ్మో నేను రాను” అని అనేసరికి “నువ్వు ధైర్యవంతురాలివి కదా ఎందుకు వెళ్ళను అంటున్నావ్?’’ అని రేవంత్ అన్నాడు. లోపల పాములు ఉన్నాయని వెళ్లానని సత్య అనేసరికి రేవంత్ సీరియస్ అయిపోయాడు. డబ్బులు కట్ అయితే మాత్రం ఇంట్లో అందరూ సీరియస్ అవ్వాల్సి వస్తుందని చెప్పాడు.

శ్రీసత్య వెళ్లకపోయే సరికి ఇంటి సభ్యులు లక్ష రూపాయలు కోల్పోయారని బిగ్ బాస్ చెప్పేసరికి రేవంత్ కోపం పీక్స్ కి వెళ్ళిపోయింది. సత్య మీద సీరియస్ అయిపోయాడు. ఎంటర్‌టైన్మెంట్ టాస్క్ ఎంటర్‌టైన్ అవనివ్వమని శ్రీహాన్ చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇక ఇంటి సభ్యుల కోసం బిగ్ బాస్ మరొక టాస్క్ ఇచ్చాడు. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కోల్పోయిన డబ్బుని తిరిగి సంపాదించుకోవడానికి బిగ్ బాంబ్ పేరుతో టాస్క్ ఇచ్చాడు. ఇందులో రేవంత్, ఇనయా, శ్రీసత్య పాల్గొన్నారు. ముగ్గురు పోటీదారులకి ఇచ్చిన బాంబ్ వైరు సరిగా కట్ చేయాల్సి ఉంటుంది.

ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో ఏకాభిప్రాయంతో ఒకరి పేరు చెప్పమని బిగ్ బాస్ మిగతా ఇంటి సభ్యులు అడిగాడు. అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇనయా, శ్రీసత్య అని ఆదిరెడ్డి, శ్రీహాన్ అంటుంటే రోహిత్ మాత్రం శ్రీసత్య అని అన్నాడు. కీర్తి మాత్రం రేవంత్ గెలుస్తాడని అనుకుంటునట్టు చెప్పింది. రేవంత్ గెలవడానికి ఇది ఫిజికల్ టాస్క్ కాదని ఆదిరెడ్డి అన్నాడు. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

బిగ్‌బాస్ సీజన్ 6 చప్పగానే సాగుతోంది. చివరి రెండు వారాలు కూడా చిరాకు కలిగించేలాగే ఉంది. అందులోనూ ఈ సీజన్లో విన్నర్ మెటీరియల్‌గా ఏ ఒక్కరూ పర్‌ఫెక్ట్ అనిపించకపోవడం పెద్ద మైనస్. అదే ఈ సీజన్ ఫెయిల్ అవ్వడానికి పెద్ద కారణం. కాగా విన్నర్ అవుతాడని అనుకుంటున్న రేవంత్ తన బిహేవియర్ చిరాకు పెడుతున్నాడు. మాట మీద నిలకడ లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం, అలగడం, ప్రతి దానికి ఇష్యూ చేయడం చూడటానికే చిరాకుగా ఉంది. ప్రస్తుతం ఇంట్లో కామ్ అండ్ కంపోజ్డ్ రోహిత్ అనే చెప్పాలి. అతను మొదట్నించి చురుగ్గా ఆటలు ఆడి ఉంటే విన్నర్ అయ్యే వాడు. టాస్కుల్లో చురుగ్గా పాల్గొనక పోవడం అతడికి మైనస్ అయింది. ఆదిరెడ్డి నామినేషన్ సమయంలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు ఆడకుండా అతి తెలివి చూపించడం, ఎవిక్షన్ ఫ్రీపాస్ సమయంలో ఓవర్ యాక్షన చేయడం, తన గెలుపుపై అతి నమ్మకం పెట్టుకోవడం, తానే విన్నర్ అని ఎవిక్షన్ ఫ్రీ పాస్ సమయంలో పదే పదే చెప్పుకోవడం కూడా ప్రేక్షకులను చికాకు కలిగించాయి. శ్రీహాన్ విన్నర్ అని ఇంతవరకు ఎవరికీ అనిపించలేదు. అమ్మాయిల్లో ఇనయా తప్ప మిగతావాళ్లు వేస్ట్. 

Also read: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
AP 10th Class Exam Date 2025: ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే
Kangana Ranaut: వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వివాదాల్లో 99 శాతం పురుషులే తప్పు'- టెకీ ఆత్మహత్యపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
పాకిస్థాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? జిన్నా ఆ పేరును ఎప్పుడు ఆమోదించారు?
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
AP Inter Exams: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్, పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Romantic Life : శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
శృంగార సామర్థ్యాన్ని కిల్ చేస్తోన్న కూల్ డ్రింక్స్.. ఎక్కువ తాగకండి బ్రదర్, రన్​అవుట్​ అయిపోతారట
Embed widget