![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
BiggBoss 6 Telugu: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?
BiggBoss 6 Promo: బిగ్ బాస్‌లో ప్రైజ్ మనీ రివైవ్ చేసే టాస్క్ ఇంకా కొనసాగుతోంది.
![BiggBoss 6 Telugu: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా? Rohit vs Adi reddy Task in BiggBoss 6 Telugu BiggBoss 6 Telugu: రోహిత్ వర్సెస్ ఆదిరెడ్డి, ఇద్దరిలో గెలుపు ఎవరిది - రేవంత్ గొడవలు ఇక ఆపడా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/258c8e948df27be0c44086645480cd141670396989629248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BiggBoss 6 Promo: బిగ్‌బాస్ సీజన్ 6 చప్పగానే సాగుతోంది. చివరి రెండు వారాలు కూడా చిరాకు కలిగించేలాగే ఉంది. అందులోనూ ఈ సీజన్లో విన్నర్ మెటీరియల్‌గా ఏ ఒక్కరూ పర్‌ఫెక్ట్ అనిపించకపోవడం పెద్ద మైనస్. అదే ఈ సీజన్ ఫెయిల్ అవ్వడానికి పెద్ద కారణం. కాగా విన్నర్ అవుతాడని అనుకుంటున్న రేవంత్ తన బిహేవియర్ చిరాకు పెడుతున్నాడు. మాట మీద నిలకడ లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం, అలగడం, ప్రతి దానికి ఇష్యూ చేయడం చూడటానికే చిరాకుగా ఉంది. ప్రస్తుతం ఇంట్లో కామ్ అండ్ కంపోజ్డ్ రోహిత్ అనే చెప్పాలి. అతను మొదట్నించి చురుగ్గా ఆటలు ఆడి ఉంటే విన్నర్ అయ్యే వాడు. టాస్కుల్లో చురుగ్గా పాల్గొనక పోవడం అతడికి మైనస్ అయింది. ఆదిరెడ్డి నామినేషన్ సమయంలో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు ఆడకుండా అతి తెలివి చూపించడం, ఎవిక్షన్ ఫ్రీపాస్ సమయంలో ఓవర్ యాక్షన చేయడం, తన గెలుపుపై అతి నమ్మకం పెట్టుకోవడం, తానే విన్నర్ అని ఎవిక్షన్ ఫ్రీ పాస్ సమయంలో పదే పదే చెప్పుకోవడం కూడా ప్రేక్షకులను చికాకు కలిగించాయి. శ్రీహాన్ విన్నర్ అని ఇంతవరకు ఎవరికీ అనిపించలేదు. అమ్మాయిల్లో ఇనాయ తప్ప మిగతావాళ్లు వేస్ట్.
ఇక ప్రోమోలో ఏముందంటే రేవంత్ శ్రీహాన్ ఫుడ్ కోసం కప్పు తెచ్చుకో అన్నాడు. నేను తినమని చెప్పలేదు అన్నాడు. శ్రీహాన్ ‘ఇప్పుడు అన్నావ్ కదా’ అన్నాడు. దానికి రేవంత్ హైపర్ అయిపోయాడు. ప్రతి దాంట్లో తప్పులు వెతక్కండి అంటూ వాదించడం చికాకు కలిగించింది. తాను ఏమంటున్నాడో కూడా తెలియని స్థితిలో ఆయన ఉన్నాడో లేక, చేసింది ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తుందో తెలియదు కానీ ఊరికే వాదనలకు దిగుతాడు.
రోహిత్ - ఆదిరెడ్డి టాస్కు
కాగా రోహిత్, ఆదిరెడ్డిలకు టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. మిగతా ఇంటి కంటెస్టెంట్లకు 20 వేల చొప్పున నగదు ఇచ్చి, వారు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో వారి పక్కన నిల్చోమన్నారు. కాగా రోహిత్‌ను కేవలం శ్రీసత్య మాత్రమే సపోర్ట్ చేసింది. ఇక మిగతా నలుగురు ఆదిరెడ్డినే సపోర్ట్ చేశారు. అంటే ఆదిరెడ్డి గెలిస్తే 80 వేల రూపాయలు ప్రైజ్ మనీకి కలుస్తుంది. అదే రోహిత్ గెలిస్తే కేవలం 20 వేల రూపాయలే ప్రైజ్ మనీకి కలుస్తుంది. ఎవరు గెలుస్తారో ఎపిసోడ్లో చూడాలి.
View this post on Instagram
Also read: బిగ్‌బాస్ ఇంట్లో దెయ్యం, అరుపులతో భయపెట్టేసిన ఆ కంటెస్టెంట్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)