By: Haritha | Updated at : 07 Dec 2022 06:47 AM (IST)
(Image credit: Star maa)
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 ముగింపుకు చేరుకుంటోంది. చివరి రెండు వారాల్లో ఏదో రోజు దెయ్యం ఎంట్రీ ఉంటుంది. ఆ రోజు రానే వచ్చింది. నిన్నటి ఎపిసోడ్లో అర్థరాత్రి దాటాకా కాసేపు దెయ్యం అరుపులతో ఇంటి సభ్యులను భయపెట్టారు బిగ్ బాస్. కొంతమంది భయపడినట్టు నటించారు. కొంతమంది మాత్రం ధైర్యంగానే ఉన్నారు. ఇలా హఠాత్తుగా ఇంట్లో దెయ్యం అరుపులు వినిపించడానికి కారణం మాత్రం శ్రీసత్యనే. ఆమె అర్థరాత్రి ఇంటి సభ్యులందరికీ దెయ్యం కథను చెప్పడం మొదలుపెట్టింది. ఆమె సగం కథ చెప్పేసరికే ఇంట్లో దెయ్యం అరుపులు రావడం మొదలయ్యాయి. దీంతో ఆమె భయంతో శ్రీహాన్ మంచం మీదకి వెళ్లిపోయింది. తరువాత కాసేపు దెయ్యం హంగామానే సాగింది. లగేజ్ రూమ్‌లో చెక్ చేయడానికి వెళ్లారు అందరూ. తరువాత ఇనాయ దెయ్యం పట్టినట్టు ప్రవర్తించింది. ఆదిరెడ్డిని భయపెట్టడానికి ప్రయత్నించింది. అతనిలో కాసేపు ఫైట్ చేసింది.
ఇక టాస్కుల విషయానికి వస్తే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఖర్చుపెట్టిన మనీని వెనక్కి ఇచ్చేందుకు బిగ్‌బాస్ రకరకాల టాస్కులు పెడుతున్నాడు. వాటిల్లో కొన్ని గెలుస్తున్నారు, కొన్ని ఓడి పోతున్నారు ఇంటి సభ్యులు. అయితే మంగళవారం మాత్రం రెండు టాస్కులు గెలిచారు. రేవంత్, ఇనాయకు పేపర్ గ్లాసులతో పిరమిడ్ కట్టే టాస్కు ఇచ్చారు బిగ్ బాస్. ఇది ఎవరు గెలుస్తారో ఇంటిసభ్యులు కరెక్టుగా ఊహించి చెబితే, ఆ వ్యక్తే గెలిస్తే... ప్రైజ్ మనీకి లక్ష పదివేల రూపాయలు యాడ్ అవుతుంది. ఈ టాస్కులో రేవంత్ గెలిచాడు. ఇంటి సభ్యులు కూడా ఆయనే గెలుస్తాడని చెప్పారు. దీంతో ప్రైజ్ మనీకి పెరిగింది.
ఇక తరువాత ఛాలెంజ్ కోసం ఆదిరెడ్డి - కీర్తి, శ్రీహాన్ - శ్రీసత్యలు ఆడేందుకు సిద్ధమయ్యారు. వీరికి మనీ ట్రాన్స్ ఫర్ అనే టాస్కు ఇచ్చారు. ఇందులో ఆడుతున్న జంట కర్రల సాయంతో ఇచ్చిక నగదు బోర్డులను బాక్సులో వేయాలి. ఇందులో అందరూ ఆదిరెడ్డి - కీర్తి గెలుస్తారని ఊహించారు. కానీ శ్రీసత్య - శ్రీహాన్ గెలిచారు. దీంతో లక్ష రూపాయలు మళ్లీ బిగ్ బాస్ ఖాతాలోకి వెళ్లిపోయాయి.
మరో టాస్కులో బిగ్ బాస్ రెండు లక్షల రూపాయలు వెనక్కిస్తున్నట్టు చెప్పాడు. ఈ ఛాలెంజ్‌ను ఇనాయ, రేవంత్ తీసుకున్నారు. ఒక ఇసుక మూటను వేలాడ దీసి దీనికి చిన్న రంధ్రం పెట్టారు. కింద డబ్బాలు పెట్టారు. వీరిద్దరూ బాక్సింగ్ గ్లవ్స్ వేసుకుని ఆ ఇసుక మూటలను గుద్దుతూ ఉంటే ఇసుక డబ్బాలో పడుతుంది. ఎవరి డబ్బా త్వరగా నిండుతుందో వారే విజేత. ఇందులో రేవంత్ గెలిచాడు. ఇంటి సభ్యులు కూడా అతనే గెలుస్తాడని ఊహించారు. కాబట్టి రెండు లక్షలు ప్రైజ్ మనీకి కలిసింది.
Some funniest scary tales in the Bigg Boss house!
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) December 6, 2022
Catch all the fun tonight on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/J6XJpZ80H1
Also read: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు
Mehaboob On Sri Satya: శ్రీసత్య విషయంలో చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకోబోయిన అర్జున్, మెహబూబ్
Deepthi Sunaina vs Shanmukh: ఏమోనే vs జాను - యూట్యూబ్లో పోటాపోటీగా దీప్తి, షన్నుల వీడియో సాంగ్స్, ఎవరికి ఎన్ని వ్యూస్ అంటే!
వీజే సన్నీ దొంగతనం చేశాడా? బ్యాగ్ నిండా డబ్బులతో సీసీటీవీ కెమేరాకు చిక్కిన వైనం
Bigg Boss Telugu TRP: క్రేజ్ తగ్గిందా? పాతాళానికి పడిపోయిన ‘బిగ్ బాస్’ రేటింగ్? సీజన్-6 ఫెయిల్యూర్కు కారణాలివే!
Inaya Proposes Sohel : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా
Krishna Tribunal : కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటుపై వీడని సందిగ్ధత, అభిప్రాయం చెప్పేందుకు ఏజీ నిరాకరణ
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు