అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్న బిగ్‌బాస్, విన్నర్ ప్రైజ్ మనీ పెంచేందుకు వింత టాస్కులు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్నాడు.

Bigg Boss 6 Telugu: ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం విన్నర్ ప్రైజ్ మనీని వాడుకున్నారు ఇంటి సభ్యులు. యాభై లక్షల ప్రైజ్ మనీలో దాదాపు 11 లక్షల రూపాయల దాకా కోత పడింది. దాన్ని మళ్లీ సంపాదించుకునే అవకాశాన్ని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఇందులో భాగంగా రకరకాల టాస్కులు ఇస్తున్నారు. దీనికి ఇద్దరు సభ్యులు పోటీ పడాలి. వారిద్దరిలో ఎవరు గెలుస్తారో మిగతా ఇంటి సభ్యులు సీక్రెట్ ఓట్ ద్వారా చెప్పాలి. వారు చెప్పిన సభ్యుడే గెలిస్తే కొంత మొత్తం విన్నర్ ప్రైజ్ లో కలిసి పోతుంది. అలా నిన్న ఎపిసోడ్లో శ్రీసత్య, రోహిత్ పోటీ పడ్డారు. ఫిజికల్ టాస్కు ఇచ్చాడు బిగ్ బాస్. అందరూ రోహిత్ స్ట్రాంగ్ కాబట్టి ఆయనే గెలుస్తాడని ఊహించారు. శ్రీసత్య పేరుపై రెడ్ మార్కు గుద్ది, బ్యాలెట్ బాక్సులో వేసేశారు. తీరా చూస్తే శ్రీసత్య గెలిచింది. దీంతో ఆ టాస్కు ఇంటి సభ్యులు ఓడిపోయారు. దీంతో లక్షా పదివేల మొత్తాన్ని వెనక్కి రప్పించుకోలేకపోయారు. 

ఇక ఈరోజు  మొదటి ప్రోమోలో ఇనాయ, రేవంత్ ఆడేందుకు సిద్ధమయ్యారు. అతి స్పీడుగా ఉండే వీరిద్దరికీ బిగ్ బాస్ చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా చేసే టాస్కు ఇచ్చారు. పేపర్ గ్లాసులను పిరమిడ్ ఆకారంలో కట్టి, వాటిని మోసుకుంటూ ఎదురుగా పెట్టిన ప్రదేశంలోకి మోసుకెళ్లాలి. ఇద్దరివీ చాలా సార్లు పడిపోయాయి. కాకపోతే చివరికి ఎవరు గెలిచారో మాత్రం తెలియదు. 

ఇక రెండో ప్రోమోలో ఆదిరెడ్డి - కీర్తి, శ్రీహాన్ - శ్రీసత్య ఆట ఆడుతూ కనిపించారు. ఎమౌంట్ రాసిన బోర్డులను, చేత్తో ముట్టుకోకుండా కర్రలతో ఎత్తి ఇద్దరూ బాక్సులో వేయాలి. కింద పడితే ఓడిపోయినట్టే. మరి ఈ ఆటలో ఏమైందో ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి. ఇదే ప్రోమోలో రేవంత్ - శ్రీసత్య వాదించుకుంటూ కనిపించారు. ఎవరు ఆడాలన్న విషయంపై వారు వాదించుకున్నారు. 

ఇరవై ఒక్క మందితో కళకళలాడిన ఇల్లు ఇప్పుడు ఏడుగురితో మిగిలింది. ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే టాప్ 6 మిగులుతారు. అదే ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తే టాప్ 5 మిగులుతారు. రెండు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో తేలిపోనుంది. డిసెంబర్ 18న బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే గ్రాండ్ గా జరగనున్నట్టు సమాచారం.

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

Also read: ఫైమాకు బిగ్‌బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఇదే - ఆమె సొంతింటి కల తీరుతుందా?

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Embed widget