Bigg Boss 6 Telugu: ఫైమాకు బిగ్‌బాస్ ఇచ్చిన రెమ్యునరేషన్ ఇదే - ఆమె సొంతింటి కల తీరుతుందా?
Bigg Boss 6 Telugu: తల్లిదండ్రులకు సొంతిల్లు ఇవ్వాలన్నది తన లక్ష్యమని చెప్పాంది ఫైమా.
Bigg Boss 6 Telugu: పేదరికంలో పుట్టి పెరిగింది ఫైమా. తన టాలెంట్‌తో జబర్దస్త్‌లో నవ్వించింది. అక్కడ వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్‌లో అడుగుపెట్టింది. ఏకంగా 90 రోజులు ఉంది. 13వ వారం ఎలిమినేట్ అయి ఇంటికెళ్లిపోయింది. ఇన్నిరోజులు ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఉన్నందుకు రెమ్యునరేషన్ ఎంత దక్కిందో తెలుసుకోవాలన్న ఆత్రుత ప్రేక్షకులకు ఉంటుంది. ఆ డబ్బుతో ఆమె అనుకున్న సొంతింటి కల నెరవేరుతుందా? అనే సందేహం కూడా ఉంది.
ఎన్ని లక్షలు?
మనకున్న సమాచారం ప్రకారం ఫైమాకు వారానికి పాతిక వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమె వారానికి రెండు ఎపిసోడ్లలో జబర్దస్త్ ప్రొగ్రామ్ చేసినప్పటికీ ఈ మొత్తం రాదు. అందుకే ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఆమె 13 వారాలు ఉన్నందుకు మూడు లక్షల ఇరవై అయిదు వేల రూపాయలు దక్కనుంది. అంటే నెలకు లక్ష రూపాయల లెక్క అందుకుంది. జబర్దస్త్ సంపాదనతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అయితే బిగ్ బాస్ నుంచి వెళ్లాక ఆమెకు ఆఫర్లు కూడా పెరగవచ్చు. యూట్యూబ్ ఫాలోవర్లు పెరుగుతారు. తద్వారా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా ఎక్కువ సంపాదించవచ్చు.
తన తల్లిదండ్రులకు సొంతిల్లు ఇవ్వడానికి ఫైమా డబ్బులు కూడబెడుతోంది. అందుకే తాను బిగ్ బాస్‌కు వచ్చానని చెబుతోంది. వారికి సొంతిల్లు ఇచ్చాకే తాను పెళ్లి చేసుకుంటానని, ఇందుకు రెండేళ్ల సమయం పెట్టుకున్నానని చెప్పింది. ఈ రెండేళ్లలో తన తల్లిదండ్రులకు సొంతిల్లు ఇచ్చాక తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మూడు లక్షల పాతిక వేలతో ఇల్లు రాకపోవచ్చు, కానీ ఆమె లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ నగదు కూడా ఎంతో కొంత సహకరిస్తుంది. అందుకే ఈ నగదుతో కూడా ఆమె సంతోషంగానే ఉందని సమాచారం. ముఖ్యంగా ఎలిమినేట్ అయిన రోజు బిగ్ బాస్ వేదికపై నాగార్జున ఆమె చేతిని ముద్దాడడం మాత్రం ఆమెకు మంచి మెమోరీగా మిగిలిపోవడం ఖాయం.
View this post on Instagram
Also read: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు