Bigg Boss 6 Telugu: ఇంట్లో అతనే అన్‌డిజర్వ్ అంటున్న శ్రీహాన్, కాదు అతనే విన్నర్ మెటీరియల్ అంటున్న ప్రేక్షకులు
Bigg Boss 6 Telugu:బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు వస్తుండడంతో గేమ్‌లో వేడి తగ్గింది.
Bigg Boss 6 Telugu: రెండు వారాల్లో బిగ్ బాస్ ముగింపునకు రానుంది. ఈలోపు ఇంట్లో రకరకాల టాస్కులు,గేమ్‌లు ఇస్తున్నాడు బిగ్ బాస్. టిక్కెట్ టు ఫినాలే గెలుచుకుని ఫైనల్లోకి ప్రవేశించిన శ్రీహాన్ ఒక పని అప్పజెప్పాడు బిగ్ బాస్. ఎవరైతే ఇంటి నుంచి బయటికి వెళ్లాలని అనుకుంటున్నారో ఆ సభ్యులకు మీరు ‘అన్ డిజర్వ్’ అనే ట్యాగ్ ఇవ్వాలని చెప్పాడు. దీంతో శ్రీహాన్ ఆ ట్యాగ్‌ను రోహిత్ కు ఇచ్చాడు. ‘మీరు చాలా మారారు, కానీ 10వ వారం తరువాత మార్పు కనిపించింది’ అన్నాడు. దానికి రోహిత్ ‘నేను మారలేదు, మొదట్నించి ఇలాగే ఉన్నా’ అని సమాధానం చెప్పాడు. ఇద్దరూ కాసేపు వాదంచుకున్నారు. ఇక రోహిత్ చివరలో ‘మీరిచ్చారు, నేను తీసుకున్నాను, ఖతమ్’ అన్నాడు. కానీ రోహిత్ ఇప్పుడు ప్రేక్సకుల ఓట్లతో రెండో స్థానంలో దూసుకుపోతున్నాడు. ఒకరోజైతే ఏకంగా రేవంత్ ను దాటి మొదటి స్థానానికి కూడా వచ్చాడు. పొదుపుగా మాట్లాడడం, అనవసరంగా అరవకపోవడం, గొడవలు పడకపోవడం... వంటివి అతనిలో అందరి నచ్చుతున్న లక్షణాలు. అతనే విన్నర్ మెటీరియల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ప్రేక్షకులు.
విన్నర్ ప్రైజ్‌మనీ వెనక్కి...
ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం విన్నర్ ప్రైజ్ మనీలో కోత పడిన విషయం తెలిసిందే. ఆ ప్రైజ్ మనీ తిరిగి సంపాదించుకునేందుకు అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఇచ్చిన టాస్కులను ఎవరు ఆడాలో ఇంటి సభ్యులే నిర్ణయించుకోవాలి. అలా రోహిత్, శ్రీసత్య గేమ్ ఆడారు. వారిద్దరూ టాస్కులో చాలా పనులు చేశారు. కాగా వీరిద్దరూ గార్డెన్ ఏరియాలో ఆడుతుంటే... బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి మిగతా కంటెస్టెంట్లను పిలిచారు. రోహిత్, శ్రీసత్యలలో ఎవరు ఓడిపోతారని అనుకుంటారో వారి పేరుపై స్టాంప్ గుద్ది బ్యాలెట్ బాక్సులో వేయాలని చెప్పారు. దాదాపు అందరూ శ్రీసత్య పేరు మీద గుద్దినట్టు తెలుస్తోంది. ఇక రోహిత్, శ్రీసత్యలలో ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చూడాలి.
View this post on Instagram
Also read: ‘ఎవడు గెలిస్తే నాకేంటి?’ శ్రీహాన్‌పై శ్రీసత్య సీరియస్ - ఇంట్లో ఎవరిది ఏ స్థానం?