By: ABP Desam | Updated at : 21 Dec 2021 10:59 AM (IST)
పవన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తోన్న 'భీమ్లానాయక్' సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని అందరికంటే ముందుగానే స్లాట్ బుక్ చేసింది టీమ్. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చి కొన్ని నెలలు దాటేసింది. కానీ ఇప్పుడు సినిమా చెప్పిన టైమ్ కి రావడం లేదు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అఫీషియల్ గా వెల్లడించారు. మంగళవారం నాడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మీటింగ్ లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లానాయక్' తప్పుకున్నాడని.. ఫిబ్రవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. అలానే అనీల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తోన్న 'ఎఫ్3' సినిమా రిలీజ్ డేట్ ని కూడా వాయిదా వేశారు. ఏప్రిల్ 29న 'ఎఫ్3'ని రిలీజ్ చేస్తామని చెప్పారు. 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని.. ఏప్రిల్ 1న సినిమా విడుదలవుతుందని చెప్పారు.
మొత్తానికి సంక్రాంతికి రాబోతున్న సినిమాలపై క్లారిటీ వచ్చేసింది. 'ఆర్ఆర్ఆర్' తో పాటు 'రాధేశ్యామ్' సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు 'భీమ్లానాయక్' వాయిదా పడింది కాబట్టి నాగార్జున 'బంగార్రాజు' సినిమా సంక్రాంతి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై కూడా రెండు, మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.
మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా 'భీమ్లానాయక్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
Also Read: పవన్ కల్యాణ్‌తో క్రిష్ మీటింగ్... 'హరి హర వీరమల్లు' గురించి కొత్త అప్‌డేట్!
Also Read: మణిరత్నం సినిమా వల్ల నాని సినిమాకు ఆ ఇద్దరూ దొరకలేదు!
Also Read: మరో మెగా హీరోతో... సంపత్ నందికి సినిమా చేసే ఛాన్స్ వచ్చిందా?
Also Read: సేవ చేస్తున్నందుకు లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్? రాజకీయ అవినీతిని టార్గెట్ చేసిన 'గాడ్సే'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ - శోభాశెట్టి చీటింగ్ గేమ్, శివాజీ ఫ్రస్ట్రేషన్
Bigg Boss: ‘బిగ్ బాస్’ విన్నర్‌పై ఆరోపణలు, ట్రోఫీ తిరిగి ఇచ్చేస్తానంటూ వీడియో
Samantha: అప్పుడలా, ఇప్పుడిలా - గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత, ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Ram Charan: కొత్త ఫ్రెండ్‌తో రామ్ చరణ్ ఫోటో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Hyderabad Crime: ప్రేమ కథ విషాదాంతం - ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య
/body>