News
News
X

Sampath Nandi: మరో మెగా హీరోతో... సంపత్ నందికి సినిమా చేసే ఛాన్స్ వచ్చిందా?

సంపత్ నందికి మరోసారి మెగా ఫ్యామిలీ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందా? 'వచ్చే అవకాశాలు ఉన్నాయి' అనేది ఇండస్ట్రీ టాక్.

FOLLOW US: 
Share:
మెగా ఫ్యామిలీలో హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ సంపత్ నందికి వచ్చిందా? మరో మెగా హీరోతో ఆయన సినిమా చేయబోతున్నారా? అంటే.... 'అవును' అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా సంపత్ నంది సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనుందని తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీలో ఇంతకు ముందు రామ్ చ‌రణ్‌తో సంపత్ నంది 'రచ్చ' సినిమా చేశారు. ఆ తర్వాత పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. 'సర్దార్ గబ్బర్ సింగ్' సంపత్ నంది దర్శకత్వంలో చేయాలని అనుకున్నారు. అయితే... ఆ తర్వాత అనూహ్యంగా దర్శకుడి మార్పు జరిగింది. ఇప్పుడు పవన్ మేనల్లుడు సాయి తేజ్ హీరోగా సినిమా చేసే అవకాశం ఆయన తలుపు తట్టింది.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఓ సూపర్ హిట్ సినిమాకు సంపత్ నంది సీక్వెల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సినిమా డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. దానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించనున్నారు. ముందు ఆ సినిమా మొదలు అవుతుందా? లేదంటే సాయి తేజ్ సినిమా మొదలు అవుతుందా? అనేది త్వరలో తెలుస్తుంది. గోపీచంద్ హీరోగా 'సీటీమార్' సినిమా చేసిన తర్వాత సంపత్ నంది మరో సినిమా స్టార్ట్ చేయలేదు. 'సింబా' అనే సినిమాకు స్క్రిప్ట్ అందించారు. ఆ సినిమా నిర్మాతల్లో ఆయన కూడా ఒకరు.
Also Read: సేవ చేస్తున్నందుకు లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్? రాజకీయ అవినీతిని టార్గెట్ చేసిన 'గాడ్సే'
Also Read: గాల్లోంచి అలా అలా... ఎన్టీఆర్, చరణ్ ఎంట్రీ అదుర్స్ అంతే! మీరూ వీడియో చూడండి!
Also Read: 'మగాడివైతే రా ఆడు అన్నారు..' ఇప్పుడు గెలిచి చూపించాడు.. సన్నీ గెలుపుకి కారణాలివే..
Also Read: అరె.. ఈ ట్రోల్స్ ఏంట్రా? షన్ముఖ్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్, నవ్వు ఆపుకోండి చూద్దాం!
Also Read: బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న 'మిర్చి' బ్యూటీ.. గుండెబరువెక్కిస్తున్న ఎమోషనల్ ట్వీట్
Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 20 Dec 2021 03:43 PM (IST) Tags: Tollywood Mythri Movie Makers sampath nandi Sai Dharam Tej New Movie Sai Tej Sampath Nandi Movie With Sai Tej

సంబంధిత కథనాలు

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Rakhi Sawant Mother Death: రాఖీ సావంత్ తల్లి జయ భేదా కన్నుమూత - ఇక ఎవరు నన్ను హగ్ చేసుకుంటారంటూ భావోద్వేగం

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Ajith Kumar’s AK62 Movie: అజిత్ సినిమా నుంచి దర్శకుడు విఘ్నేష్ శివన్ ఔట్? కారణం అదేనా?

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!

IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!

-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ

-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ