By: ABP Desam | Updated at : 20 Dec 2021 02:48 PM (IST)
Image Credit: Star Maa/Hotstar And Social Media
‘బిగ్ బాస్’ సీజన్ 5.. ముగిసింది. విన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది. అయితే, నెటిజన్స్ మాత్రం.. ఈ సీజన్‌ను ఇంకా మరిచిపోవడం లేదు. కొందరు సన్నీ విషెస్ చెబుతూ బిజీగా ఉంటే.. మరికొందరు మాత్రం రన్నరప్ షన్ముఖ్ జస్వంత్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా షన్ను-సిరి జోడీని మీమ్స్‌తో ఆడేసుకుంటున్నారు.
షన్ను.. ‘బిగ్ బాస్’ ఇంట్లోకి అడుగుపెడుతున్నాడని తెలిసిన రోజే విజేత అతడే అని తేలిపోయింది. అతడిని వెనక్కి నెట్టేవాడే లేడని అతడి అభిమానులు భావించారు. కొన్నివారాలు అతడి హవాయే నడించింది. అతడితో స్నేహం చేసిన జస్సీ, సిరీలకు కూడా బిగ్ బాస్‌లో లైఫ్ వచ్చింది. వారి స్నేహం ప్రేక్షకులకు కూడా నచ్చేసింది. అయితే, జస్సీ హౌస్ నుంచి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలైంది. సిరి-షన్నులు ఇతర ఇంటి సభ్యులతో కలవకుండా గ్రూప్‌గా ఉండేవారు. ఆ తర్వాత హగ్గులు.. హద్దులు మీరిన స్నేహం ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. ఆ వ్యతిరేకత క్రమేనా సన్నీకి అనుకూలంగా మారింది. షన్ను అభిమానులతో పోటాపోటీగా ఓటేయ్యడం మొదలెట్టారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండానే సన్నీకి ఓట్లు వచ్చేశాయి. చివరికి విజయం అతడినే వరించింది. అలాగని షన్నును తక్కువ చేయలేం. అతడి అభిమానుల నుంచే కాకుండా.. యూత్ నుంచి ఓట్లు బాగా పడ్డాయి. కానీ, విజేతగా తిరిగొస్తాడు అనుకున్న షన్ను.. రన్నరప్‌తో సరిపెట్టుకోవడం నిరుత్సాహపరిచే విషయమే. సిరితో ముందుగానే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి ఉంటే.. షన్ను-సన్నీ మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లు ఉండేదేమో. అయితే, షన్ను కప్ మిస్ కావడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ ట్రెండవ్వుతున్నాయి. వాటిని చూస్తే మీ నవ్వు ఆగదు.
గమనిక: ఈ కింది ట్రోల్స్, మీమ్స్‌లోని అంశాలు ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలు. వాటిని ఇక్కడ యథాతథంగా అందిస్తున్నాం. వారు పేర్కొన్న అంశాలతో ‘ఏబీపీ దేశం’, ‘ఏపీబీ నెట్‌వర్క్’కు ఎటువంటి సంబంధం లేదని గమనించగలరు.
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి
Bigg Boss Season 7 Latest Promo: అహంకారంతో మట్లాడొద్దు - ఆట సందీప్‌కు శివాజీ వార్నింగ్, అమర్ దీప్‌కు శోభా షాక్
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
/body>