Akhila Narayanan: అమెరికా సాయుధ దళంలో చేరిన అందాల తమిళ నటి
యువనటి అఖిల నారాయణన్ అమెరికా సైన్యంలో చేరింది.
తమిళ హీరోయిన్ గా అఖిల నారాయణన్ ఎంతో మందికి పరిచయం. గతేడాది ఆమె ‘కాదంబరి’అనే హర్రర్ సినిమాలో నటించింది ఈ అమ్మడు. ఆ సినిమా ఆమెకు మంచి పేరునే తెచ్చి పెట్టింది. అఖిల తల్లిదండ్రులు ఎన్నో ఏళ్ల క్రితమే అమెరికాలో సెటిల్ అయ్యారు. దీంతో అఖిల చిన్నప్పట్నించి అక్కడే పెరిగింది. చదువు పూర్తి చేసింది కూడా అక్కడే. తమిళనాడుకు చెందిన ప్రవాస భారతీయురాలు ఆమె. అఖిల అమెరికా సైన్యంలో చేరాలన్నది చిన్నప్పటి కోరిక. నటిగా మారినప్పటికీ ఆమె లక్ష్యం మాత్రం మారలేదు. అందుకే సినిమాను పక్కన పెట్టి మళ్లీ అమెరికా చేరిపోయింది. మిలిటరీ చేరేందుకు కఠోర శిక్షణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అమెరికా సైన్యంలో లాయర్ గా ఉద్యోగం సాధించింది. అమెరికా సాయుధ దళాలలోకి ప్రవేశించడం అంత సులువుకాదు. చాలా నెలల పాటూ పోరాట శిక్షణ పొందాలి. వాటన్నింటిని అఖిల శ్రద్ధగా పూర్తిచేసుకుందట.
అఖిల మంచి గాయని కూడా. ఆన్‌లైన్లో ఆమె సంగీత పాఠశాలను కూడా నడుపుతోంది. ఆ స్కూలు పేరు ‘నైటింగేల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్’. తాను పెరిగిన అమెరికాకు సేవ చేయడం తన విధి అని చెప్పింది అఖిల. అందుకే అక్కడి సైన్యంలో చేరినట్టు తెలిపింది. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ దేశంలో ఉంటున్నట్టు చెప్పింది.
View this post on Instagram
View this post on Instagram