Punnami Nagu: చిరంజీవి ‘పున్నమి నాగు’ సినిమా వెనక ఇంత కథ నడిచిందా? ఆసక్తికర విషయాలు చెప్పిన నిర్మాత
చిరంజీవి నటించిన ‘పున్నమి నాగు’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తీయడానికి వెనక ఓ కథ ఉందట. ఇటీవల ఆ విషయాన్ని ఏవిఎం ప్రొడక్షన్ ప్రస్తుత నిర్మాత అరుణ గుహన్ వెల్లడించారు.
Punnami Nagu: తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. అయితే వాటిల్లో చాలా సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ అలా గుర్తిండిపోతాయి. ప్రతీ హీరో కెరీర్ లోనూ అలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి. అలా మెగాస్టార్ చిరంజీవి నటించి మెప్పించిన చాలా సినిమాల్లో ‘పున్నమి నాగు’ సినిమా కూడా చెప్పొచ్చు. ఈ సినిమాలో చిరంజీవి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. చిరంజీవికు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఏవిఎం’ ప్రొడక్షన్స్ లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను ఏవిఎం బ్యానర్ లోనే తీయడానికి ఓ పెద్ద కారణమే ఉంది. ఇటీవల ఆ విషయాన్ని ఏవిఎం బ్యానర్ నాలుగవ తరం నిర్మాత అరుణ గుహన్ వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలసి ‘పున్నమి నాగు’ సినిమా వెనక ఇంత కథ నడిచిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట మెగా ఫ్యాన్స్.
పెద్ద నిర్మాణ సంస్థ ‘ఏవిఎం ప్రొడక్షన్స్’..
భారత దేశంలో చలన చిత్ర రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది ఏవిఎం ప్రొడక్షన్స్. ఈ బ్యానర్ నుంచి కొన్ని వందల సినిమాలు విడుదలయ్యాయి. ఈ ప్రొడక్షన్స్ ద్వారా వందలాది మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు పరిచయమయ్యారు. చాలా మంది దిగ్గజ హీరోలతో ఈ సంస్థ సినిమాలు తీసింది. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ లో నాల్గవ తరం నిర్మాతలు కొనసాగుతున్నారు. అయితే ఇటీవల పున్నమినాగు సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను అరుణ గుహన్ చెప్పారు.
ఆ కారణంతో చిరంజీవిని ఒప్పించి..
ఎన్నో వందల సినిమాలు తెరకెక్కించిన ‘ఏవిఎం’ సంస్థ 1976 తర్వాత సినిమాలను నిర్మించడం తగ్గించింది. అదే సమయంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఏ.వి.మెయ్యప్పన్ ఆరోగ్యం కూడా క్షీణించింది. తర్వాత ఆయన 1979 లో కన్నుమూశారు. అయితే అప్పుడే చిరంజీవితో సినిమాను నిర్మించాల్సి ఉంది. ఆ తర్వాత చాలా కాలం పాటు సంస్థ నుంచి ఏ సినిమాలు రాలేదు. అయితే మెయ్యప్పన్ చనిపోవడానికి ముందే తన కుమారులతో సంస్థను యథావిధిగా కొనసాగించాలని మాట తీసుకోవడంతో ఆయన సంవత్సరీకం సందర్భంగా ఓ సినిమా చేయాలని అనుకున్నారు. అందుకు చిరంజీవిను కలసి అడిగారు. అప్పటికే చిరంజీవి ఫుల్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నారు. అప్పుడే ఆయనకు పెళ్లి కూడా అయ్యింది. అయితే చిరంజీవి తమ సంస్థలో సినిమా చేయాలనేది తన తండ్రి కోరిక అని చెప్పడంతో చిరంజీవి వెంటనే ఓకే చేసేశారట.
‘పున్నమి నాగు’ అని పేరు పెట్టింది చిరంజీవే..
ఏవిఎం సంస్థ వారు అడగగానే సినిమాకు ఓకే చేశారు చిరంజీవి. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఈ మూవీ కోసం రాత్రి పూట కూడా షూటింగ్ కు వచ్చేవారు చిరంజీవి. ఆ విధంగా సినిమాను పూర్తి చేశారట. ఇంతకీ ఈ సినిమాకు ‘పున్నమి నాగు’ అని పేరు పెట్టింది కూడా చిరంజీవేనట. ఈ మూవీ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అప్పట్లోనే తెలుగులో ఏవీఎమ్ ప్రొడక్షన్స్ కు భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘పున్నమి నాగు’ నిలిచింది. ఈ విషయాలన్ని చాలా సంవత్సరాల తర్వాత ఆ సంస్థ ప్రస్తుత నిర్మాతల్లో ఒకరైన అరుణ గుహన్ స్వయంగా చెప్పుకొచ్చారు.
#AVMTrivia | The extraordinary commitment of @KChiruTweets Sir.
— Aruna Guhan (@arunaguhan_) May 31, 2023
Before my great grandfather passed away in 1979, he expressed to his sons that he wanted to produce movies again.
Unfortunately he passed away soon after. My grandfather Shri M. Saravanan and grand uncles Shri… pic.twitter.com/AkaqX9CLXH
Read Also: ‘బాహుబలి’, ‘RRR’ రికార్డులను బద్దలుకొడుతుంది, ‘ప్రాజెక్ట్ K’పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు!