అన్వేషించండి

Rana on Project K: ‘బాహుబలి’, ‘RRR’ రికార్డులను బద్దలుకొడుతుంది, ‘ప్రాజెక్ట్ K’పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై నటుడు రానా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం ‘బాహుబలి’, ‘RRR’ రికార్డులను బద్దలుకొడుతుందన్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ యాక్టర్  బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అందాల భామ దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్  అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

‘ప్రాజెక్ట్ K’పై రానా సంచలన వ్యాఖ్యలు

తాజాగా ఈ చిత్రం గురించి నటుడు రానా దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులను సృష్టించబోతోందని జోస్యం చెప్పారు.  ‘ది రైజ్ ఆఫ్ ది పాన్ ఇండియా స్టార్: హౌ టు బ్రేక్ బౌండరీస్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ జియోగ్రఫీ’ అనే చర్చాగోష్టిలో పాల్గొన్న రానా, ‘ప్రాజెక్ట్ K’ గ్లోబల్ తెలుగు ఫిల్మ్‌ గా మారబోతోందని వెల్లడించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘RRR’ చిత్రాల రికార్డులను ఈ సినిమా బద్దలుకొట్టబోతోందని తేల్చి చెప్పారు. “నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’ కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  ఈ సినిమా ‘బాహుబలి’, ‘RRR’ సినిమాలు చేయలేని కొత్త రికార్డులను నెలకొల్పబోతోందన్నారు.  ఈ సినిమా కచ్చితంగా గ్లోబల్ ఫిల్మ్ గా అవతరిస్తుంది. నేను ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.    

‘ప్రాజెక్ట్ K’ చిత్రంలో విలన్ రోల్ కోసం కమల్ తో సంప్రదింపులు

తాజాగా ‘ప్రాజెక్ట్ K’ సినిమాకు సంబంధించి క్రేజ్ అప్ డేట్ అందుతోంది. లెజెండరీ నటుడు కమల్ హాసన్ తో ఈ చిత్ర నిర్మాతలు మేకర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో ఆయనను విలన్ పాత్ర పోషించాలని కోరుతున్నారట. అయితే, ఈ చర్చలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం కేవలం 20 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుందని మేకర్స్ అడుగుతున్నారు. ఇందుకోసం రూ. 150 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దీనిపై కమల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలో మళ్లీ ఆయనతో  చర్చలు జరిపి దీనిపై స్పష్టత ఇస్తామని వెల్లడించింది.  

వచ్చే ఏడాది జనవరి 12న ‘ప్రాజెక్ట్ K’ విడుదల

‘ప్రాజెక్ట్ K’ సినిమా 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనే కాకుండా, పలు విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి డానీ శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.  

Read Also: మన హీరోయిన్లు చాలా రిచ్ గురూ, అత్యధిక ఆస్తులు కలిగిన నటి ఈమే!

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget