By: ABP Desam | Updated at : 02 Jun 2023 11:07 AM (IST)
Photo Credit: Instagram
బాలీవుడ్‌ను చాలా మంది పురుష ఆధిపత్య పరిశ్రమగా పరిగణిస్తారు. అయితే, చాలా మంది బాలీవుడ్ నటీమణులు తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోగలిగారు. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ లో చాలా తేడా ఉంటుంది. హీరోలతో పోల్చితే హీరోయిన్లు రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు పలువురు హీరోయిన్లు ఒక్కో సినిమాకి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. దీపికా పదుకొనే, అలియా భట్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్ ఖాన్ తో పాటు నటీమణులు భారీగా ఆస్తులను కూడబెట్టారు. అత్యంత ధనవంతులైన బాలీవుడ్ నటీమణులు ఎవరు? వారి ఆస్తుల నికర విలువ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరుగా కొనసాగుతోంది. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 828 కోట్లు. దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్లలో నెంవర్ వన్ గా ఉంది.
ప్రియాంక చోప్రా జోనాస్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 580 కోట్లు. ప్రియాంక కొన్ని కంపెనీలలో వాటాలను కలిగి ఉన్నారు. న్యూయార్క్ లోని రెస్టారెంట్‌తో సహా ఇతర వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టింది.
బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అలియా భట్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 557 కోట్లు.
కరీనా కపూర్ ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు. లైఫ్ స్టైల్ ఆసియా ప్రకారం, ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 440 కోట్లు. అలియా భట్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్లు నుంచి 15 కోట్లు తీసుకుంటుంది.
దీపికా పదుకొణె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 314 కోట్లు. ఆమె అనేక స్టార్టప్‌లు, F&B బ్రాండ్‌లలో పెట్టుబడి పెట్టింది.
అనుష్క శర్మ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 255 కోట్లు. అనుష్క శర్మకు దుస్తులు బ్రాండ్ NUSH ఉంది. దాని మార్కెట్ విలువ దాదాపు రూ. 65 కోట్లు.
ఒకప్పుడు సినీ ప్రియులను అలరించిన మాధురీ దీక్షిత్, రూ. 248 కోట్ల నికర ఆస్తుల విలువతో దేశంలోని అత్యంత ధనిక నటీమణులలో ఒకరుగా కొనసాగుతోంది.
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. ఆమె నికర ఆస్తుల విలువ సుమారు రూ. 217 కోట్లు.
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆమె నికర ఆస్తుల విలువ రూ. 89 కోట్లు.
దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో నయనతార ఒకరు. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 165 కోట్లు.
సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన నటి అనుష్క శెట్టి. ‘బాహుబలి’ చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 120 కోట్లు.
Read Also: షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో
‘కేజీయఫ్ 3’ అప్డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
/body>