By: ABP Desam | Updated at : 01 Jun 2023 09:41 PM (IST)
Photo Credit: Sun Pictures/Twitter
కోలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జైలర్'. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. 'అన్నత్తే' వంటి లాంగ్ గ్యాప్ తర్వాత రజనీకాంత్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక చాలా రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఒక పక్క షూటింగ్ చేస్తూనే మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిన్నచిన్నగా మొదలుపెట్టారు మూవీ యూనిట్. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేస్తూ పలు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక జైలర్ మూవీ షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా సెట్స్ లో చిత్ర యూనిట్ తో కలిసి రజనీకాంత్ ఓ భారీ కేక్ ని కట్ చేస్తూ ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ తో పాటు హీరోయిన్ తమన్నా, దర్శకుడు నెల్సన్ దిలీప్, మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. ఇక ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ జైలర్ సినిమాలో రజనీకాంత్ ఓ జైలర్ గా కనిపించబోతున్నాడు. ఓ జైలు చుట్టూ జైలర్ జీవితం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమాని ట్తెరకెక్కించాడు దర్శకుడు నెల్సన్ దిలీప్. సినిమాలో రజనీకాంత్ లుక్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్ర పోషిస్తుంది. చాలాకాలం తర్వాత రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుండటం విశేషం.
వెండితెరపై రజినీకాంత్ - రమ్యకృష్ణ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో మరోసారి రమ్యకృష్ణ - రజినీకాంత్ కాంబినేషన్ ని తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా 'జైలర్' సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రమ్యకృష్ణతోపాటు శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, యోగిబాబు, సునీల్, నాగబాబు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో మలయాళ సీనియర్ హీరో మోహన్లాల్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఇక అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా రజనీకాంత్ చివరగా నటించిన 'అన్నాత్తే' మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. సిస్టర్ సెంటిమెంట్ తో మాస్ డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా కీర్తి సురేష్ ఈ సినిమాలో రజనీకాంత్ కి చెల్లెలిగా నటించింది. నయనతార, మీనా, కుష్బూ కీలకపాత్రలు పోషించారు. తెలుగులోనూ ఈ సినిమా 'పెద్దన్నయ్య' అనే పేరుతో విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి.
It's a wrap for #Jailer! Theatre la sandhippom 😍💥#JailerFromAug10@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @kvijaykartik @Nirmalcuts @KiranDrk @StunShiva8 pic.twitter.com/Vhejuww4fg
— Sun Pictures (@sunpictures) June 1, 2023
Also Read: విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీబాయ్ లవ్లీ రిప్లై
Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి
TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?
Breaking News Live Telugu Updates: బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్ విల్లా లడ్డూ
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Bigg Boss Season 7 Telugu: అరె ఏంట్రా ఇది - కన్నీళ్లతో గ్లాసు నింపాలట, కింద పడి మరీ ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్
/body>