అన్వేషించండి

విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీ‌బాయ్ లవ్లీ రిప్లై

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషి' మూవీ షూటింగ్ తాజాగా టర్కీలో జరుగుతుంది. షూటింగ్ విరామంలో భాగంగా సమంత, విజయ్ దేవరకొండ ఓ రెస్టారెంట్లో దిగిన ఫోటోని సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

'శాకుంతలం' వంటి భారీ ప్లాప్ తర్వాత సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఖుషి'. ఈ సినిమాలో సమంతకు జోడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ టర్కీలో జరుగుతుంది. ‘ఖుషి’ మూవీ షూటింగ్లో భాగంగా ఇటీవల సమంత, విజయ్ దేవరకొండ టర్కీ కి వెళ్లారు. ఇక టర్కీలో విజయ్, సమంత కలిసి పలు ప్రదేశాలను చుట్టి వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ తో ఓ రెస్టారెంట్లో దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సమంత.

తాజాగా తన పోస్టులో పేర్కొంటూ "నీ బెస్ట్ చూశాను. వరస్ట్ కూడా చూశాను. చివరగా రావడం, మొదటగా వచ్చేయడం, నీ అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూశాను. నా కోసం నిలబడ్డ ఒక మంచి స్నేహితుడు. ఎంత గొప్ప సంవత్సరం ఇది" అంటూ రాస్కొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్స్ ఈ పోస్టుపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత పోస్ట్ చేసిన ఫోటో కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక సమంత పెట్టిన ఈ పోస్ట్ కి విజయ్ దేవరకొండ స్పందిస్తూ 'ఫేవరెట్ గర్ల్' అంటూ ఒక స్మైల్ ఎమోజీతో పాటూ లవ్ ఈమోజీని జత చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీ షేర్ చేశాడు. ఈ సినిమాతో అటు సమంత ఇటు విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, నా రోజా నువ్వే అనే సాంగ్ మంచి రెస్పాన్స్ ని కనబరిచాయి. జమ్ము కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో సాగే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని UV క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జయరాం, సచిన్ ఖేడేర్కర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రం 'లైగర్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనా నడుమ విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు భారీ నష్టాలను సైతం మిగిల్చింది. ఈ సినిమా బాగా నిరాశ పరచడంతో విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ ఖుషి మూవీ పైన పెట్టుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనకు కలిసి వచ్చిన కమర్షియల్ లవ్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక సమంత విషయానికొస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన 'శాకుంతలం' తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మూవీ కూడా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో హై బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సమంత కూడా ఇప్పుడు ఖుషి మూవీ పైనే హోప్స్ పెట్టుకుంది. టాలీవుడ్ లో ఇప్పుడు సమంత మార్కెట్ స్థిరంగా ఉండాలంటే ఈ మూవీ హిట్ అవ్వడం చాలా అవసరం. మరి ఈ మూవీ అటు విజయ్ దేవరకొండ కి ఇటు సమంతకి ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.

Also Read: జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget