జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయ్యాడు. ఈరోజు నిఖిల్ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడమే కాదు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఆ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండడం విశేషం. ఇటీవల 'కార్తికేయ 2' తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న నిఖిల్ ఇప్పటికే 'స్పై' , 'ద ఇండియన్ హౌజ్' అనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా నిఖిల్ ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈరోజు నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. నిఖిల్ కెరియర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'స్వయంభూ' అనే టైటిల్ని ఖరారు చేశారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పిక్సెల్ స్టూడియోస్ పై భువన్ మరియు శ్రీకర్ పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
'స్వయంభు' అంటే 'స్వయంభువు' లేదా 'అది తన సొంత ఒప్పందంతో సృష్టించబడింది' అని అర్థం వచ్చేలా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. ఇక ఈ మూవీలో నిఖిల్ క్రూరమైన యోధుడిగా కనిపించబోతున్నాడు. తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్లో నిఖిల్ యోధుడిగా పొడవాటి జుట్టుతో ఒక చేతిలో ఈటెను, మరొక చేతిలో షీల్డ్ తో గుర్రంపై స్వారీ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్లో నిఖిల్ మేకోవర్, గెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పచ్చు. ఇప్పటివరకు నిఖిల్ ని బహుశా ఇటువంటి మేకోవర్లో ప్రేక్షకులు చూసి ఉండకపోవచ్చు. అంతలా ఈ సినిమాలో నిఖిల్ తన మేకోవర్తో అదరగొట్టేసాడు. ఇక నిఖిల్ కెరియర్ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇక ఈ 'స్వయంభూ' మూవీ ఒక యువ యోధుడిని వర్ణించే పురాణ ఫాంటసీ కథ అని తెలుస్తోంది.
View this post on Instagram
తాజాగా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ఒకసారిగా సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. దీంతో ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రానికి కే జి ఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ సంగీతమందిస్తుండగా, మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ కామిశెట్టి, జిటి ఆనంద్ సహ నిర్మాతలగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభం కానుంది. కాగా ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న 'స్పై' మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ మరణ వెనుక ఉన్న రహస్యాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గ్యారీ బిహెచ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. జూన్ 29న ఈ సినిమా విడుదల కాబోతోంది.
Our 20th Film will be #Swayambhu
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 1, 2023
🙏🏽 thanks for all the Love and Wishes on my Birthday... Will keep working harder and try to win ur hearts always 🙏🏽 @krishbharat20 @manojdft @RaviBasrur @TagoreMadhu @bhuvan_sagar @PixelStudiosoff @TimesMusicHub @jungleemusicSTH pic.twitter.com/d2fCgHmW3a
Also Read: కొత్త సినిమాను పట్టాలెక్కించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఈసారి ‘భీమ్లా నాయక్’ దర్శకుడితో!
Before You Go
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
ట్రెండింగ్ వార్తలు






















