అన్వేషించండి

Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్

ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందిన కేసులో కుమారుడితో పాటు సహకరించిన బంధువులు, మున్సిపల్ అధికారులతో కలిపి 14 మందిని నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు.

Job Scam In Nalgonda District | నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని (Fake Death Certificate) సృష్టించి కారుణ్య నియామకం పొందిన ఘటన సంచలనం రేపింది. నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖకు సంబంధించిన కేసును  పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అక్రమంగా ఉద్యోగం సాధించిన వ్యక్తితో పాటు అతనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన బంధువులు, మున్సిపల్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో కలిపి మొత్తం 14 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కుట్రలో ప్రమేయం ఉండి ప్రస్తుతం పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు గతేడాది మే 31న రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ నవంబర్ 17న మరణించారు. అయితే, వెంకటేశ్వర్లు సర్వీస్‌లో ఉండగానే ఆయన చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, ఆయన కుమారుడు చామకూరి రాజు దామరచర్ల పీహెచ్‌సీలో కారుణ్య నియామకం కింద జాబ్ సంపాదించాడు. ఈ నకిలీ సర్టిఫికెట్స్ వ్యవహారం బయటపడటంతో మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ ముఠా గుట్టును రట్టు చేశారు.

Also Read: Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్ షాపులో పేలుళ్లతో కలకలం! భద్రతపై ప్రశ్నలు
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్ షాపులో పేలుళ్లతో కలకలం! భద్రతపై ప్రశ్నలు
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Vrushakarma Songs : సూరీడే చీకట్లో నా చూపుల్లో ఉదయించాలి - ట్రెజర్ హంటర్‌గా చై స్వాగ్... వృషకర్మ ఫస్ట్ సింగిల్ లిరిక్స్
సూరీడే చీకట్లో నా చూపుల్లో ఉదయించాలి - ట్రెజర్ హంటర్‌గా చై స్వాగ్... వృషకర్మ ఫస్ట్ సింగిల్ లిరిక్స్
CM Revanth Reddy Birthday: కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget