By: ABP Desam | Updated at : 20 May 2022 01:23 PM (IST)
బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివతో ఆయన చేస్తోన్న సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో బ్యాక్ గ్రౌండ్ సెటప్ మొత్తం చూస్తుంటే గతంలో అల్లు అర్జున్ తో చేయాలనుకొని ఆగిపోయిన సినిమానే గుర్తొస్తుంది.
కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయాలనుకున్నారు. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అదే కథతో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నట్లు సమాచారం. సినిమా టైటిల్ చెప్పలేదు కానీ చేతిలో ఆయుధం, సముద్రం, లైట్ హౌస్.. ఈ సెటప్ మొత్తం చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
అప్పుడు అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం సరైనదో కాదో.. సినిమా విడుదలైతే కానీ తెలియదు. ఇక ఈ సినిమా కోసం పేరున్న టెక్నీషియన్స్ ను రంగంలోకి దింపారు. అనిరుద్ రవిచందర్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు సిరిల్, శ్రీకర్ ప్రసాద్ ఇలా పాన్ ఇండియా లెవెల్ టీమ్ ని సెట్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కనిపించబోతుంది.
Also Read: బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన కొమురం భీముడు- బృందావనంలో అందాల రాముడు
Karthika Deepam జులై 1 ఎపిసోడ్: హిమని అపార్థం చేసుకుని మోనితతో పోల్చిన శౌర్య, మనసు మార్చుకోని డాక్టర్ సాబ్
Devatha July 1st (ఈరోజు) ఎపిసోడ్: దేవి తండ్రి ఆదిత్య అంటు అసలు నిజం చెప్పేసిన రుక్ముణి- షాక్‌లో అక్కా చెల్లెళ్లు
Guppedantha Manasu జులై 1ఎపిసోడ్: రిషిని వసు రిజెక్ట్ చేసిన వీడియో ప్లే చేసేశారు, దేవయాని-సాక్షి కి వసుధార ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఏంటి!
Rocketry Movie Review - 'రాకెట్రీ' రివ్యూ: ఫస్టాఫ్‌లో సైన్స్ పాఠాలు, సెకండాఫ్‌లో భావోద్వేగాలు - నంబి నారాయణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
అయ్యో సుమా, ఈ వయసులో ఇదంతా అవసరమా, ప్రగతిలా ట్రై చేస్తే? భర్తతో శ్రీయా లిప్‌లాక్!
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల
PM Modi Tour: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని టూర్ షెడ్యూల్ ఇదే- భారీ ఏర్పాట్లు చేసిన బీజేపీ
Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !