F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
'ఎఫ్3' సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటించిన సినిమా 'ఎఫ్3'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. 'ఎఫ్ 2' సినిమాలో కనిపించిన తారలతో పాటు 'ఎఫ్3'లో కొన్ని కొత్త క్యారెక్టర్లు కనిపించాయి. పూజాహెగ్డే ఐటెం సాంగ్ కూడా చేసింది. మే 27న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ వస్తోంది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సత్తా చాటుతోంది.
ఓవర్సీస్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. దీంతో చిత్రబృందం సినిమా హిట్ అంటూ పోస్టర్లు వేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అన్నీ సీరియస్ సినిమాలే రిలీజ్ అవ్వడం కూడా 'ఎఫ్3'కి కలిసొచ్చింది. లాజిక్స్ లేని ఈ కామెడీ ఎంటర్టైనర్ ను బాగానే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ దక్కించుకుంది. సినిమా విడుదలైన నాలుగు వారాల తరువాత ఓటీటీలో రిలీజ్ చేసేలా అగ్రిమెంట్ రాసుకున్నారు. దిల్ రాజు నిర్మాత కాబట్టి ఈ నాలుగు వారాలు సినిమాను థియేటర్లో ఆడించుకోవడం ఖాయం. కాబట్టి జూన్ చివరి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందన్నమాట!
View this post on Instagram