News
News
X

Neha Chaudhary Marriage: పెళ్లి కూతురు కాబోతున్న యాంకర్‌ నేహా చౌదరి, అబ్బాయి ఎవరంటే?

యాంకర్ నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇప్పటికే చేసుకోబోయే వాడిని సెలెక్ట్ చేసుకున్న అమ్మడు.. త్వరలో ఓ ముహూర్తం చూసుకుని మూడు ముళ్లు వేయించుకోబోతోంది.

FOLLOW US: 
 
స్టార్ స్పోర్ట్స్ యాంకర్‌గా బాగా పాపులర్ నేహా చౌదరి. తాజాగా బిగ్ బాస్ సీజన్-6లోనూ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. తొలుత చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నా, కొన్ని పొరపాట్లు చేయడం మూలంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ప్రస్తుతం మళ్లీ యాంకర్ గా కొనసాగుతోంది. అటు ఈమె ఓ యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తోంది. అందులో తన లాంగ్ డ్రైవ్ లకు సంబంధించిన వీడియోలతో పాటు, ఇంట్లో వేడుకలు, సరదా సరదా ముచ్చట్లను పంచుకుంటుంది.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పిన నేహా

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పింది. త్వరలో తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వెల్లడించింది. అటు తనకు కాబోయే భర్తకు సంబంధించిన ఫోటోను కూడా తన మిత్రులకు చూపించింది. తాజాగా తన యూట్యూబ్ చానెల్ కోసం రూపొందించిన వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించింది. పలువురు యాంకర్లతో కలిసి సరదాగా ముచ్చట్లు పెడుతున్న సమయంలో తన పెళ్లి టాపిక్ వచ్చింది. అప్పుడే తను ఈ విషయాన్ని చెప్పింది. తను చేసుకోబోయే వ్యక్తి తన క్లాస్ మేట్ అని చెప్పింది. ఇద్దరు కలిసి  ఇంజనీరింగ్‌ చదివినట్లు చెప్పింది. తన పేరు అనిల్ అని, ఇద్దరం త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నాం అని చెప్పింది.

రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి పతకాలు

News Reels

ఇక నేహాకు నటన అంటే చాలా ఇష్టం అందుకే బుల్లితెరపైకి అడుగు పెట్టింది. పలు షోలకు యాంకర్ గా చేసింది. తక్కువ సమయంలోనే యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్పోర్ట్స్‌ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మడు రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది.  29 ఏండ్ల నేహా చౌదరి తిరుపతిలో జన్మించింది. కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ చదివింది. ఆ తర్వాత కొంత కాలం పాటు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసింది. ఆ తర్వాత బుల్లితెర మీద అడుగు పెట్టింది.   

యాంకర్ గా రాణిస్తున్న నేహా

తొలుత మహా న్యూస్ లో యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత సాక్షి, హెచ్ఎంటీవీ, ఎన్టీవీ, వనిత టివి, మా మ్యూజిక్ సహా పలు ఛానెళ్లలో యాంకరింగ్ చేసింది. తన చలాకీ తనంతో షోలకు మంచి ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.  సైమా అవార్డ్స్-2019 ఈవెంట్ కి హోస్టుగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ స్పోర్ట్స్ లో యాంకర్ గా అవకాశం దక్కించుకుంది.  ప్రో కబడ్డీ, ఐపీఎల్, ఐసీసీ వరల్డ్ కప్ సహా పలు ఈవెంట్స్ కి యాంకర్ గా చేసింది. యాక్టర్, డాన్సర్ గా మోడలింగ్ రంగంలో రాణించిన నేహా చౌదరి యోగ టీచర్ గా కూడా పని చేసింది. ఇటీవల బిగ్ బాస్-6 హౌస్ లోకి వెళ్లే సమయంలోనే.. తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పిందట. అనుకున్నట్లుగా హౌస్ నుంచి బయటకు వచ్చిన నేహా త్వరలో పెళ్లికూతురు కాబోతుంది.    

View this post on Instagram
 
A post shared by Anchor Neha (@chowdaryneha)

Published at : 21 Nov 2022 12:55 PM (IST) Tags: Bigg Boss 6 Telugu Anchor Neha Chaudhary bigg boss 6 contestant Neha Chaudhary Neha Chaudhary marriage

సంబంధిత కథనాలు

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Chiranjeevi Photo: నేవీ అధికారులను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయ్ - అలనాటి అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్!

Chiranjeevi Photo: నేవీ అధికారులను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయ్ - అలనాటి అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

టాప్ స్టోరీస్

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్