Urvasivo Rakshasivo Teaser: లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ - 'ఊర్వశివో రాక్షసివో' టీజర్!
'ఊర్వశివో రాక్షసివో' సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
అల్లు శిరీష్(Allu Sirish) హీరోగా నటించిన 'ఎబిసిడి' సినిమా మే, 2019లో విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లలోకి మరో సినిమాతో రాలేదు. కరోనా కారణంగా ప్రతి సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అలా శిరీష్ జర్నీకి కొవిడ్ బ్రేకులు వేసింది. 'ఎబిసిడి' సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, అల్లు శిరీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా విడుదలైన మూడేళ్లకు మరో సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Sirish and Anu’s film titled Urvasivo Rakshasivo: అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఒక సినిమాను రూపొందించింది. ఆ మధ్య ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. 'ప్రేమ కాదంట' (Prema Kadanta Movie) టైటిల్‌తో వచ్చిన ఆ సినిమాకు రాకేశ్ శశి దర్శకుడు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మార్చారు. కొత్త టైటిల్ ఏంటంటే.. 'ఊర్వశివో రాక్షసివో'. రీసెంట్ గానే టైటిల్ అనౌన్స్ చేశారు.
Urvasivo Rakshasivo Teaser: ఇక కాసేపటి క్రితం సినిమా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ మొత్తాన్ని లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ తో నింపేశారు. ఒకే ఆఫీస్ లో కలిసి పనిచేసే హీరో, హీరోయిన్లు ఒకరికొకరు ఫిజికల్ గా దగ్గరవుతారు. దాన్ని హీరో లవ్ అనుకుంటే హీరోయిన్ మాత్రం ఫ్రెండ్షిప్ అంటుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది స్టోరీ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. యూత్ కి కనెక్ట్ అయ్యేలా టీజర్ ని అయితే కట్ చేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి!
అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 4న (Allu Sirish New Movie Release Date) ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు సమంత 'శాకుంతలం' కూడా అదే రోజున రాబోతుంది. అయితే ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్స్ కి చెందినవి. అల్లు శిరీష్ కి ఇప్పుడు సక్సెస్ చాలా ముఖ్యం. మరి తను ఆశిస్తున్నట్లుగా ఈ సినిమా హిట్ అవుతుందేమో చూడాలి.
ఇక శిరీష్ కెరీర్ చూస్తే... 'గౌరవం' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా తమిళంలో కూడా విడుదల అయ్యింది. 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు', 'ఒక్క క్షణం' వంటి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. తన కంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. మలయాళంలో మోహన్ లాల్‌తో '1971 : బియాండ్ బోర్డర్స్' సినిమా చేశారు.
Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?
Excited to share the teaser of #UrvasivoRakshasivo with you all. https://t.co/lvTfubSra7
— Allu Sirish (@AlluSirish) September 29, 2022