రికార్డుల వేటకు మళ్లీ ఒక్కటైన అల్లు అర్జున్ - త్రివిక్రమ్, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా!
'అల వైకుంఠపురంలో'తో రికార్డులను బ్రేక్ చేసిన అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుందని ఆహా తెలిపింది. గెట్ రెడీ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ సునామీ అంటూ వీరిద్దరి పిక్ ను కూడా షేర్ చేసింది.,
Allu Arjun - Trivikram Combo Repeat : 'పుష్ప' మానియా ఇంకా ట్రెండింగ్ లో ఉండగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) ల కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. కానీ ఈ సారి వచ్చేది సినిమా కాదు. ఓ అడ్వర్టైజ్ మెంట్ తో. కానీ దీనిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కొందరేమో ఏదైనా షో కోసం ప్లాన్ చేస్తున్నారని అంటే, మరికొందరమో వెబ్ సిరీస్ కోసం జత కట్టనున్నారంటూ పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
'AAA సినిమాస్' (ఆసియన్ అల్లు అర్జున్ సినిమాస్) నిర్మించే ఓ వాణిజ్య ప్రకటన కోసం బన్నీ, త్రివిక్రమ్ కలిసి రానున్నట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' కోసం ఈ ఇద్దరూ కలిసి మరోసారి భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి పలు రికార్ఢులను బ్రేక్ చేయగా.. మరో సారి ఎంటర్‌టైన్‌మెంట్ సునామీ సృష్టించేందుకు సిద్ధమయ్యారంటూ తాజాగా 'ఆహా వీడియోస్' సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. "కలిశారు మళ్లీ ఇద్దరూ... ఇక రికార్డుల వేట మొదలు.. అతి పెద్ద మూవీ పండగ చేసుకుందామా? గెట్ రెడీ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ సునామీ" అని పేర్కొంటూ ఈ క్రేజీ న్యూస్ ను చెప్పారు. దాంతో పాటు వీరిద్దరూ షూట్ లో ఓ ఇంట్రస్టింగ్ పిక్ ను కూడా పంచుకుంది.
ఈ ఫొటోలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో ఏదో సీరియస్ గా సంభాషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది షూటింగ్ సెట్ లో తీసిన ఫొటోగా అర్థమవుతోంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ తెగ ఉప్పొంగిపోతున్నారు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా సినిమా చేస్తారా, లేదా ఆహా (Aha) ఛానల్ కోసం ఏదైనా షో చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అల.. వైకుంఠపురంలో'.. సినిమా ఏ రేంజ్ లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వీరిద్దరూ మళ్ళీ ఇప్పుడు చేతులు కలపడంపై అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇరువురి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Kalisaru malli 'Iddaru'..🤝
— ahavideoin (@ahavideoIN) June 12, 2023
ika Recordula veta modhalu..!🤙
It’s none other than Maatala Mantrikudu Trivikram, directing @alluarjun
Athi pedda 'Movie' Panduga chesukundama..?
Get Ready for entertainment 'tsunami' 🎬 🌊
Coming soon! #AAtakesoverAha pic.twitter.com/Icru5A2rCZ
ప్రస్తుతం త్రివిక్రమ్.. ప్రిన్స్ మహేష్ బాబుతో 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ఓ క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా సాగుతుండగానే.. ఇప్పుడు బన్నీతో మరో ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ రావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ కూడా 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను... భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Read Also : Niharika Divorce Rumors: ఆ ఫొటోతో మళ్లీ తెరపైకి వచ్చిన నిహారిక విడాకుల అంశం - అది నిజమేనా?