By: ABP Desam | Updated at : 12 Jun 2023 01:00 PM (IST)
Image Credit: Instagram
మెగా డాటర్ నిహారిక విడాకుల రూమర్స్ తో మరోసారి వార్తల్లోకెక్కింది. లేటెస్ట్ గా నిహారిక పెట్టిన పోస్ట్ ఈ రూమర్స్ కి మరింత ఊతమిస్తోంది. ఇటీవల నిహారిక సోదరుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో పాటు పలువురు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. కానీ నిహారిక భర్త చైతన్య, అతని కుటుంబం మాత్రం కనిపించకపోవడంతో విడాకుల వార్తలు నిజమేనేమోనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వరుణ్ తేజ్ కి కాబోయే భార్య లావణ్య త్రిపాఠిని తమ కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతూ నిహారిక వాళ్ళతో కలిసి దిగిన ఫోటో ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందులో అన్నావదినతో నిహారిక మాత్రమే ఉంది. ఈ ఫోటో కింద నెటిజన్స్ పలు కామెంట్స్ పెట్టారు. 'జిజ్జు రాలేదా'? అని ఒక యూజర్ కామెంట్ చేస్తే.. 'వరుణ్ జిజ్జు ఎక్కడా'? మరొక యూజర్ ప్రశ్నించాడు. థర్డ్ యూజర్ 'వేర్ ఈజ్ చై' అంటే ఇంకొక యూజర్ 'వాళ్ళు విడిపోయారు బ్రో' అంటూ కామెంట్లు పెట్టారు. ఇటీవల కాలంలో నిహారిక ఎక్కడ చూసిన ఒక్కతే కనిపిస్తుంది. గతంలో ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళిన వెకేషన్ ట్రిప్ లో కూడా భర్త చైతన్య లేకపోవడంతో విడాకుల రూమర్స్ ఎక్కువ అయ్యాయి.
గత కొద్ది రోజులుగా నిహారికకు తన భర్త చైతన్యతో తరచూ గొడవలు అవుతున్నాయని అందుకే వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. చైతన్య ఇన్స్టాగ్రామ్ ఖాతాని కూడా నిహారిక అన్ ఫాలో కొట్టారు. అంతే కాదు వాళ్ళిద్దరూ పెళ్లి ఫోటోస్ కూడా డిలీట్ చేసింది. 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. పలు సినిమాలు చేసింది కానీ ఏవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. తర్వాత చైతన్యని పెళ్లి చేసుకుంది. హీరోయిన్ గా సినిమాలు చేయకపోయినా సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ఆ ప్రొడక్షన్ హౌస్ లో చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మిస్తుంది. ఇప్పటికే నీహారిక ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన కొన్ని వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఆమె డెడ్ పిక్సెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ టైమ్ లో తనపై వస్తున్న రూమర్స్ గురించి ఘాటుగానే స్పందించింది. పనీ పాటా లేని వాళ్ళు ట్రోల్స్ చేస్తారని అలాంటి వాళ్ళ గురించి తాను అస్సలు పట్టించుకోనని చెప్పుకొచ్చింది. మరీ ఇప్పుడు ఈ ఫోటోకి ఏమైనా సమాధానం చెప్తుందా? లేదంటే లైట్ తీసుకుంటుందో చూడాలి.
Also Read: బాలీవుడ్ కాదు దక్షిణాదిలోనే నెపోటిజం ఎక్కువ - అవికా గోర్ సంచలన వ్యాఖ్యలు
Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?
Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్ను మర్డర్ చేసిందెవరు? క్లూస్ టీమ్‌లో హీరో ఏం చేశాడు?
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్
Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్డీ ప్రింట్ లీక్
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
/body>