అన్వేషించండి

Avika Gor: బాలీవుడ్ కాదు దక్షిణాదిలోనే నెపోటిజం ఎక్కువ - అవికా గోర్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న అవికా గోర్ సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్ లో కంటే సౌత్ లోనే నెపోటిజం ఎక్కువగా ఉంటుందని నటి అవికా గోర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. త్వరలో తను నటించిన ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉంటోంది. తాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది చిత్రాలపై తన అభిప్రాయం గురించి ఆమె మాట్లాడుతూ నెపోటిజం గురించి కూడా మాట్లాడింది.

“స్టార్ పవర్ అంటే సౌత్. స్టార్ పవర్ మీదే సౌత్ మొత్తం నడుస్తోంది. ఇక నెపోటిజం విషయానికి వస్తే ఆ మాట విని విని విసిగిపోయాం. సౌత్ లో ఇది చాలా ఎక్కువ. కానీ ఇక్కడ ప్రేక్షకులు చూస్తున్నట్టు అక్కడి వాళ్ళు చూడరు. బాలీవుడ్, హిందీ చిత్రాల గురించి కాలక్రమేణా పక్షపాతం జరుగుతుంది. సౌత్ సినిమాలు చాలా రీమేక్ అవుతున్నాయి. వాటిని బాలీవుడ్ కాపీ కొడుతుందని అందరూ అనుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ మొత్తం బంధుప్రీతితో నిండి ఉంది. ప్రజలు కూడా దీనికి హైప్ క్రియేట్ చేస్తున్నారు. కొంతకాలానికి ఇది తగ్గుతుందని ఆశిస్తున్నా” అని ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి అవికా ఇప్పుడే బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. తెలుగులోనే ఆమె సినిమాలు ఎక్కువ చేసింది. అటువంటి తెలుగు ఇండస్ట్రీ గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేకక్షలకు బాల నటిగా అవికా గోర్ పరిచయం అయ్యింది. తర్వాత రాజ్ తరుణ్ సరసన 'ఉయ్యాల జంపాల' సినిమాతో వెండి తెర మీద హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజు గారి గది 3' సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్ గా పాప్ కార్న్ సినిమాతో పలకరించింది కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.  తాజాగా హారర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

2008 లో వచ్చిన 1920 హారర్ సినిమాకు కొనసాగింపుగా తీసిన ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలొ కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అవికా గోర్ లీడ్ రోల్ పోషించింది. విక్రమ్ భట్ కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. వెన్నులో వణుకు పుట్టించే విధంగా బ్యాగ్ రౌండ్ స్కోర్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

Read Also: నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో మందు బాటిళ్లు కొట్టేసిన దొంగలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Avika Gor (@avikagor)

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget