By: ABP Desam | Updated at : 16 Apr 2023 06:39 PM (IST)
Image Credit:Akhil/Instagram
Agent: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తోన్న తాజా చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా కు టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కించారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, ఫస్ట్ లుక్ లకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. టైటిల్ పోస్టర్ ను విడుదల చేసినప్పటి నుంచే మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మధ్య స్పై యాక్షన్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఏజెంట్’ సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది. దీంతో మూవీకు సంబంధించిన ట్రైలర్ అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. తాజాగా ట్రైలర్ కు సంబంధించిన తేదీను ఖరారు చేసింది మూవీ టీమ్ అంతే కాదు ప్లేస్ ను కూడా ఫిక్స్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అఖిల్ అక్కినేనికి ఇప్పటివరకూ సరైన బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా రాలేదనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తోన్న అఖిల్ కు హిట్ మాత్రం దక్కడం లేదు. మధ్యలో కొన్ని సినిమాలు ఆకట్టుకున్నా అవి కమర్షియల్ హిట్లు గా మాత్రం నిలబడట్లేదు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నారు అఖిల్. అందుకే ఈ ‘ఏజెంట్’ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. సినిమాలో లుక్ కోసం కూడా ఎన్నో నెలలు కష్టపడినట్లు తెలుస్తోంది. ఈ మూవీతో కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు అఖిల్. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం పెట్టారు. ట్రైలర్ రిలీజ్ కు సంబంధించి గతంలో ఏప్రిల్ 18న డేట్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా టైమ్ అండ్ ప్లేస్ ను కూడా ఫిక్స్ చేశారు. కాకినాడ లోని ఎంసి లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో రాత్రి 7:30 గంటలకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ మేరకు అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో రెండు చేతులతో గొలుసులు చుట్టుకొని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ మూవీతో అయినా అఖిల్ కమర్షియల్ హీరోగా నిలదొక్కుకుంటారో లేదో చూడాలి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమా బ్యానర్ లపై అనిల్ సుంకర ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. పాన్ ఇండియా లెవల్ లోనే ఈ మూవీను విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో మమ్ముట్టి, దినో మోరియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ భారీ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Also: బాక్సాఫీస్ దగ్గర చతికిల పడిన ‘శాకుంతలం’ - మరీ ఇంత తక్కువ?
THE WILDEST POSTER of #AGENT is here 😎#AgentTrailer on APRIL 18th @ 𝟕:𝟑𝟎 𝐏𝐌🔥
— AK Entertainments (@AKentsOfficial) April 16, 2023
Grand Launch at MC Laurin High School Grounds, Kakinada💥#AGENTonApril28th @AkhilAkkineni8 @mammukka #DinoMorea @sakshivaidya99 @DirSurender @AnilSunkara1 @AKentsOfficial @laharimusic pic.twitter.com/BaHEP4fMOn
Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి
షారుక్‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?
Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?