Shaakuntalam Collection: బాక్సాఫీస్ దగ్గర చతికిల పడిన ‘శాకుంతలం’ - మరీ ఇంత తక్కువ?
సమంత నటించిన తాజాగా చిత్రం ‘శాకుంతలం’ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరుస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రెండో రోజు కేవలం రూ.1.5 కోట్లు రాబట్టింది.
ప్రముఖ నటి సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘శాకుంతలం’. ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రం విడుదల అయ్యింది. కాళిదాసు నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ నుంచి ప్రేరణ పొంది గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ ఈ చిత్రంలో భరతుడి పాత్ర పోషించింది.
బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచిన ‘శాకుంతలం’
భారీ అంచనాల నడుమ విడుదలైన హిస్టారికల్ ఫాంటసీ డ్రామా ‘శాకుంతలం’ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. తొలి షో నుంచే ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. బాక్సాఫీస్ షేక్ చేస్తుందని భావించిన ఈ సినిమా మొదటి రోజున కేవలం రూ. 5 కోట్లు మాత్రమే రాబట్టింది. రెండో రోజు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా రాలేదు. వీకెండ్ కావడంతో మంచి వసూళ్లు వస్తాయని ఆశించిన చిత్ర నిర్మాతలకు ఆశాభంగం ఏర్పడింది.
‘శాకుంతలం’ రెండో రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంతంటే?
‘శాకుంతలం’ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పెద్ద సంఖ్యలో స్క్రీన్‌లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం మొదటి రోజు భారీ ప్రేక్షకులను ఆకర్షించలేదు. అన్ని భాషలలో రూ. 5 కోట్లు రాబట్టింది. 2వ రోజు మరింత తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ‘శాకుంతలం’ 2వ రోజున కేవలం రూ. 1.5 కోట్లు వసూలు చేసింది. ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. కానీ, వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. కనీసం రెండు రోజులు కూడా ఓ మోస్తారు కలెక్షన్లు సాధించకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. కనీసం సండే కావడంతో ఇవాళ అయినా, ప్రేక్షకులు సినిమా చూసేందుకు తరిలి వస్తారేమో అని ఆశిస్తున్నారు.
‘శాకుంతలం’ సినిమా గురించి
‘శాకుంతలం’ సినిమాను దుశ్యంతుడు, శకుంతల కథ ఆధారంగా గుణశేఖర్ తెరకెక్కించారు. కాళిదాసు రచించిన ప్రసిద్ధ నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ 'శాకుంతలం' సినిమాను నిర్మించారు. ఇందులో దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు నటించారు.
View this post on Instagram
Read Also: ఇప్పటికైనా నాకు కారు కొనివ్వండి - నిర్మాతను కోరిన బుట్టబొమ్మ!