By: ABP Desam | Updated at : 05 Jan 2023 06:53 PM (IST)
అఖండలో బాలకృష్ణ
2021లో సంచలన విజయం సాధించిన తెలుగు సినిమాల్లో ‘అఖండ’ ఒకటి. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో డబ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను హిందీలో విడుదల చేయనుంది. జనవరి 20వ తేదీన హిందీ థియేటర్లలో అఖండ డబ్ వెర్షన్ సందడి చేయనుంది.
దీనికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. హిందూత్వం నేపథ్యంలో వచ్చిన ‘కార్తికేయ-2’ సూపర్ హిట్ అయింది కాబట్టి ‘అఖండ’ కూడా బ్లాక్‌బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హీరోయిజం ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న సినిమాలకు హిందీలో బ్రహ్మరథం పడుతున్నారు. ‘అఖండ’లో బోయపాటి, బాలయ్య మాస్ కాంబినేషన్‌కు థమన్ అదిరిపోయే రీ-రికార్డింగ్ తోడయింది.
ఇక తెలుగునాట కూడా సంక్రాంతికి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’తో పలకరించనున్నారు. క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
బాలకృష్ణ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' రికార్డును 'అఖండ' విడుదల అయిన పది రోజుల్లోనే క్రాస్ చేసింది. బాలకృష్ణకు తొలి రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది. 'అఖండ'తో నట సింహ వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.
Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?
The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!
PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి
Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!
HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం