(Source: ECI/ABP News/ABP Majha)
Aha: మిగతా భాషల వైపు చూస్తున్న ఆహా - కన్నడ, మలయాళంపై దృష్టి!
Allu Arjun: స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఆహా కొత్త స్ట్రాటజిక్ పార్ట్‌నర్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది.
Aha Strategies: దక్షిణాది సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌లు సాధిస్తున్నాయి. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం తెలుగువారి ఓటీటీ ప్లాట్‌ఫాంగా నిలిచిన ఆహా ఇప్పుడు వ్యూహాత్మక పెట్టుబడిదారుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. సబ్‌స్క్రిప్షన్ బేస్‌ను పెంచుకుంటూ మిగతా దక్షిణాది భాషల్లో కూడా విస్తరించాలన్నది ఆహా ప్లాన్ అని మనీకంట్రోల్ తన నివేదికలో పేర్కొంది.
దీని కోసం కేపీఎంజీ కార్పొరేట్ ఫైనాన్స్‌ను స్ట్రాటజిక్ అడ్వైసర్‌గా నియమించినట్లు తెలుస్తోంది. ఆర్గానిక్ గ్రోత్ అవకాశాలను పెంచాలనుకోవడమే దీనికి కారణం. రూ.2,000 కోట్ల వరకు వాల్యుయేషన్‌ను ఆహా ఎక్స్‌పెక్ట్ చేస్తుందని తెలుస్తోంది.
మై హోం గ్రూపు హైదరాబాద్ ఆధారిత సంస్థ. కన్‌స్ట్రక్షన్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో పెట్టుబడులను కలిగి ఉంది. అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ అనే కంపెనీని కూడా మై హోం స్థాపించింది. టీవీ9 గ్రూపు కూడా ఈ కంపెనీ కిందనే ఉంది. అలాగే గీతా ఆర్ట్స్ కూడా 50 సంవత్సరాల చరిత్ర ఉన్న చిత్ర నిర్మాణ సంస్థ. తెలుగు, హిందీ సహా అనే భాషల్లో గీతా ఆర్ట్స్ సినిమాలు నిర్మించింది. ఆహాలో ఈ రెండు సంస్థలకు వాటాలు ఉన్నాయి.
‘2020లో లాంచ్ అయినప్పటి నుంచి ప్రీమియం, ఒరిజినల్ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను కోరుకునే తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఆహా డెస్టినేషన్‌లా మారింది. ఆహాలో 900కు పైగా సినిమాలు, సిరీస్ ఉన్నాయి. అలాగే ఆహా ఒరిజినల్స్ పేరిట సిరీస్‌ను కూడా క్రియేట్ చేస్తున్నారు. నెలకు ఏడు మిలియన్ల వరకు యాక్టివ్ యూజర్లు ఆహా సొంతం.’ అని ఆహా ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద స్థానిక ఓటీటీ ప్లేయర్‌గా ఆహానే నిలిచింది. ఆహా ట్రిపుల్ గ్రోత్ స్ట్రాటజీపై పని చేయనుంది. ఒక పక్క టైర్ 2, టైర్ 3 నగరాల్లోకి దూసుకుపోతూనే, మరోవైపు అంతర్జాతీయంగా తెలుగు, తమిళ భాషల వారికి చేరువ కావడంతో పాటు, కన్నడ, మలయాళం వంటి ప్రాంతీయ భాషల్లోకి కూడా చొచ్చుకుపోవాలనేది ఆహా ప్లాన్. దీంతో ‘యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్’ను కూడా పెంచాలని ఆహా లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశంలో మొత్తం మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్లో సౌత్ ఇండియా 35 శాతం కంట్రిబ్యూట్ చేస్తుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఆహా రూ.122.08 కోట్ల ఆదాయాన్ని సంపాదించినట్లు నివేదించింది. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన రూ.76.02 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 61 శాతం ఎక్కువ. అలాగే నష్టాలు కూడా 31 శాతం పెరిగినట్లు తెలిపింది.