By: ABP Desam | Updated at : 29 Jan 2023 03:07 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Mythri Movie Makers/Instagram
సాధారణంగా సమాజంలో సినిమా హీరోలు, రాజకీయ నాయకులు లాంటి ప్రముఖులు పబ్లిక్ లో మాట్లాడే మాటలు బయట ఎంతటి ప్రభావం చూపుతాయో పెద్దగా చెప్పక్కర్లేదు. ఒక్కోసారి వారు మాట్లాడే మాటలు కాంట్రవర్సీ అవుతూవుంటాయి కూడా. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు మాట్లాడే మాటలు మరింతగా వైరల్ అవుతూ వుంటాయి. అందులోనూ పెద్ద పెద్ద హీరోలు ఒక్కోసారి అనుకోకుండా చేసే వ్యాఖ్యలు గురితప్పుతూ ఉంటాయి. అవి అటు ఇండస్ట్రీలోనూ ఇటు అభిమానుల్లోనూ చర్చలకు దారితీస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ‘వీర సింహారెడ్డి’ సినిమా విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, తాజాగా ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవ సభలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల మెగా స్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అయి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీకు బాబీ దర్శకత్వం వహించగా, రవితేజ ప్రత్యేక పాత్రలో కనిపించారు. సినిమాలో చిరంజీవి నటన, అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఇలా అన్ని బాగుండటంతో మంచి సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. మూవీ భారీ విజయాన్ని సాధించడంతో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ నెల 28 న వరంగల్ లో విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ సభలో చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సినిమాలో చిరంజీవి రవితేజ మధ్య ఓ సన్నివేశం గురించి చిరు మాట్లాడుతూ చిన్న హీరో, పెద్ద హీరో అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. రవితేజను చిన్న హీరో అని సంభోదించడం పట్ల ఇండస్ట్రీలో ఈ మాట చర్చనీయాంశమైంది. అటు రవితేజ ఫ్యాన్స్ కూడా ఒకింత అసహనం వక్తం చేస్తున్నారట. దీంతో ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
గతంలో ‘వీర సింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో కూడా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇలాగే వివాదాస్పదం అయ్యాయి. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘రామారావు, రంగా రావు, అక్కినేని..తొక్కినేని..’ అని అనుకోకుండా ఫ్లో లో మాట్లాడేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు చర్చనీయాశం అయ్యాయి. దీనిపై అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు కూడా ట్వీట్ లు చేశారు. అక్కినేని ఫ్యాన్స్ బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని నిరసనలు కూడా చేశారు. దీంతో ఈ విషయం పై కూడా రెండ్రోజులు మీడియాలో చర్చలు సాగాయి. అయితే ఈ వివాదం పై ఎస్వీ రంగారావు మనవళ్లు మాత్రం పాజిటివ్ గా స్పందించారు. తర్వాత బాలకృష్ణ తన వ్యాఖ్యల పై వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వంగా అనలేదని, ఏన్నాఆర్ అంటే తనకూ ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు.
Read Also: ఔను, ఇద్దరం వెకేషన్‌కు వెళ్లాం, కానీ - విజయ్‌తో ప్రేమాయణంపై రష్మిక కామెంట్స్
ఏదైమైనా ఇండస్ట్రీలో ఇంతటి అనుభవం ఉన్న పెద్ద హీరోలు ఇలా ఒక్కోసారి టంగ్ స్లిప్ అవ్వడం చర్చలకు దారితీస్తున్నాయి. ఇవి ఒక్కోసారి ఫ్యాన్స్ మధ్య వివాదానికి కూడా ఆద్యం పోస్తున్నాయి. అందుకే హీరోలు ఇలాంటి వ్యాఖ్యలు పట్ల ఆచితూచి మాట్లాడాలని హితవు పలుకుతున్నారు సినీ నిపుణులు.
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..
18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు
Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు
Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?