Rashmika Mandanna: ఔను, ఇద్దరం వెకేషన్‌కు వెళ్లాం, కానీ - విజయ్‌తో ప్రేమాయణంపై రష్మిక కామెంట్స్
విజయ్ దేవరకొండతో డేటింగ్ వార్తలపై రష్మిక మందన్న స్పందించింది. అతడితో కలిసి మాల్దీవులు వెకేషన్ కు వెళ్లినట్లు చెప్పింది. అందులో తప్పేముందని ప్రశ్నించింది.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇద్దరు కలిసి మాల్దీవులు వెకేషన్ కు వెళ్లారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇంతకాలం ఈ వార్తలపై ఇటు రష్మిక, అటు విజయ్ స్పందించలేదు. తాజాగా తనతో ఎలాంటి డేటింగ్ వ్యవహారం లేదని తేల్చి చెప్పింది. ఇద్దరు కలిసి మల్దీవులు పర్యటనకు వెళ్లిన మాట వాస్తవమేనని చెప్పింది. అయినా, అందులో తప్పేముందని ప్రశ్నించింది. మేమిద్దరం మంచి స్నేహితులు మాత్రమేనని వెల్లడించింది. మొత్తంగా వారిద్దరు డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలకు ఈ వ్యాఖ్యలతో చెక్ పెట్టే ప్రయత్నం చేసింది రష్మిక మందన్న.
‘డియర్ కామ్రేడ్’ తర్వాత డేటింగ్ ఊహాగానాలు
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంటగా తొలిసారి ‘గీత గోవిందం’ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో నటించారు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. తరుచుగా వీరిద్దరు కలిసి తిరగడం, వెకేషన్ కు వెల్లడం హాట్ టాపిక్ గా మారింది. కానీ, ఈ గాసిప్స్ పై రష్మిక, విజయ్ పెద్దగా స్పందించలేదు.
మాల్దీవులు వెకేషన్ కు వెళ్లాం- రష్మిక
తాజాగా రష్మిక ‘మిషన్ మజ్ను’ అనే సినిమాలో నటించింది. ఈ నేపథ్యంలో విజయ్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. విజయ్ దేవరకొండతో తనకు ఎలాంటి రిలేషన్ షిప్ లేదని వెల్లడించింది. ఇద్దరూ కలిసి మాల్దీవులు పర్యటనకు వెళ్లినట్లు ఆంగీకరించినా, అందులో తప్పేముందని ప్రశ్నించింది. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని చెప్పింది.
View this post on Instagram
ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘మిషన్ మజ్ను’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ, ఈ సినిమా ఆమె బాలీవుడ్ కెరీర్ కు పెద్దగా కలిసి రాలేదనే చెప్పుకోవచ్చు. దళపతి విజయ్ తో కలిసి నటించిన ‘వారిసు’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో కలిసి ‘యానిమల్’ అనే సినిమాలో నటిస్తోంది. ఆయన నటించిన ‘బ్రహ్మాస్త’ తాజాగా మంచి విజయాన్ని అందుకుంది. మొత్తంగా దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అటు బాలీవుడ్ లోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. అటు విజయ్ దేవరకొండ చివరగా నటించిన ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీ డిజాస్టర్ గా మిగిలింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. ప్రస్తుతం సమంతాతో కలిసి ‘ఖుషీ’ అనే సిమా చేస్తున్నాడు.
Read Also: లోకేష్ కనగరాజ్‌ను ఏ తెలుగు నిర్మాత నమ్మలేదు - ‘విక్రమ్’ దర్శకుడిపై సందీప్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు