Priyanka Chopra: చెత్త డైలాగులు, గంటల తరబడి ఎదురుచూపులు - ఆ సినిమా అంటే ఇప్పటికీ అసహ్యం: ప్రియాంక చోప్రా
తాను నటించిన సినిమాల్లో ఓ మూవీ పరమ అసహ్యం కలిగించిందని అందాల తార ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెజాన్ ప్రైమ్ లై డిటెక్టర్ పరీక్షలో ఆమె పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది.
హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ను, అమెజాన్ సంస్థ గ్రాండ్ గా రూపొందించింది. రస్సో బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిటాడెల్’ సిరీస్ ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ మొదలయ్యింది. రీసెంట్ గా ఫైనల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చింది. యాక్షన్ ప్రియులను ఈ సిరీస్ బాగా ఆకట్టుకుంది. ‘సిటాడెల్’లో ప్రియాంక ఎలైట్ గూఢచారి నదియా సిన్ పాత్రలో నటించింది.
ఆ సినిమా అంటే ఇప్పటికీ అసహ్యం
తాజాగా ప్రియాంకతో అమెజాన్ ప్రైమ్ ఆసక్తికర ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆమెకు లై డిటెక్టర్ అమర్చి ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ప్రియాంక పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. మీరు నటించిన సినిమాల్లో నచ్చని సినిమా ఏదైనా ఉందా? అనే ప్రశ్నకు.. కచ్చితంగా ఉందని చెప్పింది. ఆ సినిమా పేరు చెప్పను కానీ, ఆ సినిమా షూటింగ్ అనుభవం చాలా చెత్తగా ఉందని వివరించింది. సెట్స్ లో గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చేదని, తీరా తనకు ఇచ్చే డైలాగ్ లు పరమ చెత్తగా ఉండేవని చెప్పింది. అస్సలు సెన్స్ లేకుండా ఆ డైలాగులు ఉండేవని వివరించింది. ఓ బొమ్మలాగా తనను అక్కడ కూర్చోబెట్టేవారని వెల్లడించింది. అలా ఉండటం తనకు నచ్చదని, అందుకే ఆ సినిమా అంటే పరమ అసహ్యం అని చెప్పింది.
తరచుగా చెప్పే అబద్దం అదే!
బర్గర్ ఇష్టమా? పరోటా ఇష్టమా? అనే ప్రశ్నకు.. తనకు పరోటా అంటేనే చాలా ఇష్టం అని చెప్పింది. తరచుగా తన ఇంట్లో పరోటాలను తింటూ ఉంటానని చెప్పింది. మీరు తరచుగా చెప్పే అబద్దం ఏంటి? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది. తనకు ఎవరైనా ఫోన్ చేస్తే వచ్చేస్తున్నా, దారిలో ఉన్నా అని అబద్దం చెప్తానంది. తను అలా చెప్పానంటే ఎవ్వరూ నమ్మొద్దని చెప్పింది. తరచుగా అద్దం చూసుకుంటారా? అనే ప్రశ్నకు ఔను అనే సమాధానం ఇచ్చింది. తనకు ఎక్కడ చిన్న అద్దం కనిపించినా అందులో తన ముఖం చూసుకుంటానని చెప్పింది. చివరికి షాపింగ్ మాల్ లో చిన్న స్పూన్ కనిపించినా, అందులో తన ముఖం చూసుకుంటానని వెల్లడించింది. అటు నిద్రలో గురక పెడతారా? అనే ప్రశ్నకు.. తన భర్త నేను గురక పెడుతూ ఉంటానని చెప్తుంటాడని, కానీ, తాను గురక పెట్టనని చెప్పింది. ఇక హాలీవుడ్, బాలీవుడ్ లో ఏ సినిమా ఇండస్ట్రీ నీకు ఇష్టం అనే ప్రశ్నకు, ఆమె సమాధానం చెప్పక ముందే వీడియో కంప్లీట్ అయ్యింది.
ప్రియాంక ఇటీవల రిచర్డ్ మాడెన్ నటించిన స్పై సిరీస్ సిటాడెల్‌లో కనిపించింది. ది రస్సో బ్రదర్స్ రూపొందించిన యాక్షన్-ప్యాక్డ్ షో, గ్లోబల్ గూఢచారి సంస్థ ‘సిటాడెల్’కు చెందిన ఇద్దరు ఎలైట్ ఏజెంట్లు మాసన్ కేన్ (రిచర్డ్ మాడెన్), నదియా సిన్ (ప్రియాంక) చుట్టూ తిరుగుతుంది.
Read Also: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా