News
News
వీడియోలు ఆటలు
X

Anushka Shetty: అనుష్కను వేధిస్తున్న అరుదైన వ్యాధి - ఆమె నవ్వితే షూటింగ్ ఆపేస్తారట!

అనుష్క శెట్టి ఓ వింత వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. ఒక్కసారి మొదలు పెడితే అర గంట పాటు నవ్వుతూనే ఉంటుందట. నవ్వును కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందట.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వింత వింత సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పటికే సమంత, మమత మోహన్‌ దాస్‌, రేణు దేశాయ్ పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ లిస్టులోకి స్వీటీ అనుష్క శెట్టి చేరింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకున్న వింత ససమస్య గురించి వివరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ అనుష్కకు ఉన్న సమస్య ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోతున్నా- అనుష్క శెట్టి

అందాల తార అనుష్కను అత్యంత అరుదైన సమస్య వేధిస్తోందట. ఒక్కసారి నవ్వడం మొదలు పెడితే సుమారు అరగంట పాటు నవ్వుతూనే ఉంటుందట. తన నవ్వును కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతోంది. “తన దగ్గర ఎవరైన జోక్ వేసినా, నవ్వించే విషయం చెప్పినా నవ్వు పరిమితికి మించి వస్తోంది. నేను ఒక్కసారి నవ్వడం మొదలు పెడితే ఆపడం సాధ్యం కావడం లేదు. సుమారు పావు గంట నుంచి అరగంట దాకా నవ్వుతూనే ఉంటాను. ఈ సమయంలో ప్రొడక్షన్ వాళ్లు టిఫిన్స్, స్నాక్స్ లాంటివి తినేసి వస్తారు. నవ్వును కంట్రోల్ చేయలేక చాలా సతమతం అవుతున్నాను” అని అనుష్క తనకున్న అరుదైన సమస్య గురించి వెల్లడించింది.

స్వీటీ సీరియస్ గానే చెప్పిందా?

అయితే, అనుష్క చెప్పిన సమస్య ఆమెను సీరియస్ గానే వేధిస్తోందా? లేక కావాలని కామెడీగా చెప్పిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా జస్ట్ కామెడీగా చెప్పిందని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎంతసేపు నవ్వితే ఏంటి? నవ్వడం ఆరోగ్యానికి మంచిదే కదా అంటున్నారు. నువ్వు ఎంతసేపు నవ్వినా మాకు ఆనందమే అని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. అనుష్కకు ఉన్న ఈ అరుదైన సమస్య గురించి త్వరలో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

నవీన్ పొలిశెట్టితో సినిమా చేస్తున్న అనుష్క

ఇక ‘బాహుబలి’ సిరీస్ తర్వాత చాలా తక్కువగా సినిమాలు చేసింది అనుష్క. ప్రస్తుతం నవీన్‌ పొలిశెట్టితో కలిసి ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది. మైత్రి మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ లో ఈ సినిమా రూపొందుతోంది.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి.

View this post on Instagram
 
A post shared by AnushkaShetty (@anushkashettyofficial)

తాజాగా మరోనటి రేణు దేశాయ్ సైతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.''గత కొంత కాలంగా నేను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాను. నా మాదిరిగానే ఎవరైనా బాధపడుతుంటే? వారిలో ధైర్యం నింపాలనే ఉద్దేశంతోనే ఈ పోస్టు పెడుతున్నాను. ఎవ్వరూ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండాలి.  జీవితం మీద నమ్మకం అనేది ఉండాలి. ఏదో ఒక రోజు మన శ్రమకు తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచం మనకోసం ఏదో ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసే ఉంటుంది. అందుకే సమస్య ఏదైనా నవ్వుతూ ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నాను. మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. మంచి ఫుడ్ తీసుకుంటున్నాను. త్వరలోనే కోలుకుని షూటింగులకు హాజరవుతాను” అని వెల్లడించింది. 

Read Also: అనారోగ్యంతో బాధపడుతున్న రేణు దేశాయ్ - గుండె బరువెక్కిస్తున్న ఆమె ఆవేదన!

Published at : 14 Feb 2023 08:48 PM (IST) Tags: Anushka Shetty actress anushka shetty anushka shetty rare disease

సంబంధిత కథనాలు

BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?

BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?

Buddy Movie First Look : తక్కువ అంచనా వేయకండి - 'బడ్డీ'తో బాక్సాఫీస్‌కు గురి పెట్టిన అల్లు శిరీష్!

Buddy Movie First Look : తక్కువ అంచనా వేయకండి - 'బడ్డీ'తో బాక్సాఫీస్‌కు గురి పెట్టిన అల్లు శిరీష్!

Priyanka Chopra: చెత్త డైలాగులు, గంటల తరబడి ఎదురుచూపులు - ఆ సినిమా అంటే ఇప్పటికీ అసహ్యం: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: చెత్త డైలాగులు, గంటల తరబడి ఎదురుచూపులు - ఆ సినిమా అంటే ఇప్పటికీ అసహ్యం: ప్రియాంక చోప్రా

BellamKonda Ganesh: మోక్షజ్ఞ నటన, డ్యాన్స్‌లతో తాత, తండ్రి పేరు నిలబెడతాడు - బాలయ్య ఫ్యాన్స్‌కు బెల్లంకొండ గణేష్ గుడ్ న్యూస్

BellamKonda Ganesh: మోక్షజ్ఞ నటన, డ్యాన్స్‌లతో తాత, తండ్రి పేరు నిలబెడతాడు - బాలయ్య ఫ్యాన్స్‌కు బెల్లంకొండ గణేష్ గుడ్ న్యూస్

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

టాప్ స్టోరీస్

AP Registrations : ఏపీలో రివర్స్ రిజిస్ట్రేషన్ల పద్దతి - ఇక మాన్యువల్‌గానే ! సర్వర్ల సమస్యే కారణం

AP Registrations :   ఏపీలో రివర్స్ రిజిస్ట్రేషన్ల పద్దతి - ఇక మాన్యువల్‌గానే ! సర్వర్ల సమస్యే  కారణం

KTR : జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !

KTR  :   జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం  - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !

Kakani Satires On Chandrababu: మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసిన ఘనత చంద్రబాబుదే- మంత్రి కాకాణి

Kakani Satires On Chandrababu: మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసిన ఘనత చంద్రబాబుదే- మంత్రి కాకాణి

Wrestlers At Haridwar: గంగా నదిలో మెడల్స్ పారవేసేందుకు సిద్ధమైన రెజ్లర్లు, అంతలోనే ఆసక్తికర పరిణామం

Wrestlers At Haridwar: గంగా నదిలో మెడల్స్ పారవేసేందుకు సిద్ధమైన రెజ్లర్లు, అంతలోనే ఆసక్తికర పరిణామం