Renu Desai: అనారోగ్యంతో బాధపడుతున్న రేణు దేశాయ్ - గుండె బరువెక్కిస్తున్న ఆమె ఆవేదన!
రేణు దేశాయ్ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పిన ఆమె, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

గత కొంత కాలంగా టాలీవుడ్ హీరోయిన్లు రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సమంత 2022 నుంచి మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఇప్పటికీ తను చికిత్స తీసుకుంటూనే ఉంది. అటు మమతా మోహన్ దాస్ విటిలిగో అనే చర్మ వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఈమె ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటోంది. పూనమ్ కౌర్ సైతం పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కూడా ఆయుర్వేద వైద్యం చేయించుకుంటున్నది. తాజాగా మరోనటి రేణు దేశాయ్ సైతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
అనారోగ్యంతో బాధపడుతున్నా, త్వరలో కొలుకుంటా- రేణు దేశాయ్
‘బద్రి’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. కొంతకాలం ఇద్దరు కలిసి ఉన్నారు. వీరికి ఓ బాబు, పాప జన్మించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో పవన్, రేణు విడిపోయారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే రేణు దేశాయ్, గత కొంత కాలంగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడించింది.
''గత కొంత కాలంగా నేను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. వాటిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాను. నా మాదిరిగానే ఎవరైనా బాధపడుతుంటే? వారిలో ధైర్యం నింపాలనే ఉద్దేశంతోనే ఈ పోస్టు పెడుతున్నాను. ఎవ్వరూ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండాలి. జీవితం మీద నమ్మకం అనేది ఉండాలి. ఏదో ఒక రోజు మన శ్రమకు తగిన ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచం మనకోసం ఏదో ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసే ఉంటుంది. అందుకే సమస్య ఏదైనా నవ్వుతూ ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నాను. మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. మంచి ఫుడ్ తీసుకుంటున్నాను. త్వరలోనే కోలుకుని షూటింగులకు హాజరవుతాను” అంటూ ఇన్ స్టాలో సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చింది. ఇంతకీ తనకు వచ్చిన సమస్య ఏంటనే విషయం మాత్రం క్లారిటీగా చెప్పలేదు.
View this post on Instagram
‘టైగర్ నాగేశ్వరరావు’తో తెలుగు తెరపైకి రీఎంట్రీ!
ప్రస్తుతం రేణు దేశాయ్ ప్రస్తుతం సినిమా రంగంలో కొనసాగుతోంది. దర్శకురాలిగా, నిర్మాతగా కాస్ట్యూమ్ డిజైనర్ గా, పలు విభాగాల్లో రాణిస్తోంది. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న రేణు దేశాయ్, ప్రస్తుతం రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’తో తెలుగు తెరపై కనిపించబోతోంది. చాలా కాలం తర్వాత వెండి తెరపై దర్శనం ఇవ్వబోతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
View this post on Instagram
Read Also: వీరి రీల్ ‘లవ్’ రియలైతే? - సినీ ప్రేమికుల ఫేవరెట్ రీల్ జోడీలు వీరే!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















