Puli Meka Trailer: పోలీసులను టార్గెట్ చేసి చంపుతున్న సైకో - ‘పులి మేక’ ట్రైలర్ వచ్చేసింది!
ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి ‘పులి మేక’ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల అయింది.
ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి నటించిన కొత్త వెబ్ సిరీస్ ‘పులి మేక’ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ట్రైలర్ ద్వారా సిరీస్‌పై బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
పోలీస్ ఆఫీసర్లను మాత్రమే టార్గెట్ చేసి చంపే సైకో కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే మధ్యలో పోలీసులను మాత్రమే కాకుండా సామాన్యులను కూడా చంపడంతో స్టోరీ ఇంట్రస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. ఈ కేసును డీల్ చేసే ఆఫీసర్‌గా లావణ్య త్రిపాఠి కనిపించనుండగా, తనకు సాయపడే మరో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో ఆది సాయికుమార్ నటించారు.
రైలు కిందకు తోసి ఒక వ్యక్తిని సైకో కిల్లర్ హత్య చేయడంతో ఈ సిరీస్ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నెలరోజుల వ్యవధిలో జరిగిన రెండు హత్యలు చేసిన ఒకే హంతకుడు ఒక్కరే అని ఆది సాయికుమార్ చెప్తారు. ఇది విన్న సుమన్ ‘ఒక సైకో పోలీసులను టార్గెట్ చేస్తున్నాడన్న మాట.’ అంటాడు. ఈ సంఘటనల అనంతరం ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ పాత్రలో లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇస్తుంది. తన పాత్రను యాక్షన్ ఎపిసోడ్ ద్వారా పరిచయం చేశారు.
సైకో కిల్లర్ కోసం పోలీస్ ఆఫీసర్ సుమన్ ఒక ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)’ ఏర్పాటు చేసి దానికి లావణ్య త్రిపాఠిని హెడ్‌గా నియమిస్తారు. సొంతంగా టీమ్ రూపొందించుకుని వెంటనే ఇన్వెస్టిగేట్ చేయమని లావణ్యకు ఆదేశాలు వస్తాయి. ఈ ముగ్గురు ఆఫీసర్లలో కామన్ పాయింట్ ఏంటి అనేది వెతకడంతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠిల మధ్య ప్రేమ సన్నివేశాలు చూపించారు.
అనంతరం కిల్లర్ కేవలం పోలీసులను మాత్రమే కాకుండా ర్యాండమ్‌గా హత్యలు చేస్తున్నట్లు చూపించారు. కిల్లర్‌తో లావణ్య త్రిపాఠి ఫైటింగ్, ఇన్వెస్టిగేషన్ షాట్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. అసలు ‘పులి మేక ఆటలో పులి ఎవరు?’ అని సాయికుమార్ అడుగుతాడు. ఇలా యాక్షన్ సీన్ల మధ్యలోనే ట్రైలర్‌ను ముగించారు.
ఈ వెబ్ సిరీస్‌లో లావణ్య త్రిపాఠి హై-ఓక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ల్లో కనిపించింది. ఈ వెబ్ సిరీస్‌కు కథను కోన వెంకట్, వెంకటేష్ కిలారు అందించారు. వహించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠిలతో పాటు సుమన్, గోపరాజు రమణ, రాజా చెంబోలు, సిరి హనుమంతు, సాయి శ్రీనివాస్, స్పందన పల్లి, ముక్కు అవినాష్ కూడా నటించారు.
'పులి - మేక'కు కె. చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించారు. మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా 'పంతం' సినిమాకు దర్శకత్వం వహించినది ఆయనే. చక్రవర్తి రెడ్డికీ ఇదే తొలి వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్‌కు వెబ్ సిరీస్‌కు ఛాయాగ్రహణం : సూర్య కళా, కూర్పు : చోటా కె. ప్రసాద్, కళా దర్శకత్వం : బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : గిరిధర్ మామిడిపల్లి, కౌముది నేమాని, సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, రచన : కోన వెంకట్, వెంకటేష్ కిలారు, దర్శకత్వం : కె. చక్రవర్తి రెడ్డి.