Tabu: 50 ఏళ్ల వయసులో టబు డిమాండ్ మాములుగా లేదు!
బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న కొన్ని భారీ బడ్జెట్ సినిమాల్లో టబుని కీలకపాత్రలు కోసం ఎంపిక చేసుకుంటున్నారు.
ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది టబు. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో మెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో నటిగా చాలా బిజీ అయింది. 51 ఏళ్ల ఈ బ్యూటీకి ఇప్పుడు బాలీవుడ్ డిమాండ్ మాములుగా లేదు. దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం రీసెంట్ గా విడుదలైన 'భూల్ భులైయా2' అనే చెప్పాలి.
పాండమిక్ తరువాత బాలీవుడ్ లో ఎలాంటి సినిమా రిలీజ్ అవుతున్నా డిజాస్టర్ అవుతుంది. అలాంటి సమయంలో కార్తీక్ ఆర్యన్, కియారా, టబు లీడ్ రోల్స్ పోషించిన 'భూల్ భులైయా2' ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. రెండొందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కంటే టబు పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు దర్శకుడు. పైగా ఆమె డ్యూయల్ రోల్ లో కనిపించి అదరగొట్టింది.
నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో టబు పెర్ఫార్మన్స్ మాములుగా లేదు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ కార్తీక్ ఆర్యన్ తో పాటు టబుకి కూడా దక్కుతుంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న కొన్ని భారీ బడ్జెట్ సినిమాల్లో టబుని కీలకపాత్రలు కోసం ఎంపిక చేసుకుంటున్నారు. రీసెంట్ గా టబు మూడు సినిమాలు సైన్ చేసినట్లు తెలుస్తోంది. పైగా ఆమెకి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట.
రెండేళ్లక్రితం టబు తెలుగులో అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలో మదర్ క్యారెక్టర్ లో కనిపించింది. ఆ తరువాత మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. మరి మన మేకర్స్ కూడా టబుపై దృష్టి పెట్టి.. ఆమెకి తగ్గ సినిమా అవకాశాలు ఇస్తారేమో చూడాలి!
Also Read: అప్పుడు జానీ డెప్ వద్దన్నారు - ఇప్పుడు 'సారీ' చెప్పి రూ.2355 కోట్లు ఇస్తామంటున్నారు!
Also Read: థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్
View this post on Instagram