Telangana Elections 2023 Live News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు
Telangana Election Live News: తెలంగాణ ఎన్నికల ప్రచార వార్తల లైవ్ అప్ డేట్స్ మీకోసం..
LIVE
Background
తెలంగాణ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి రోడ్డులన్నీ నిర్మానుష్యం కానున్నాయి. 13 జిల్లాలో సాయంత్రం 4 గంటలకే ప్రచార గడువు ముగియనుంది. అన్ని ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచే 144 సెక్షన్ అమల్లోకి రానుంది. ఈ సెక్షన్ అమలు పోలింగ్ ముగిసే వరకు కొనసాగనుంది. అంటే 30 వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది. అప్పటి వరకు గుంపులుగా తిరగడం, ప్రచారం చేయడం, డబ్బులు పంచడం నేరం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు, పోలీసులు చెబుతున్నారు.
నవంబర్ 30 ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 119 నియోజకవర్గాల్లో సింగిల్ ఫేజ్‌లోనే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 60వేల బ్యాలెట్ యూనిట్లు, మరో 14వేలు అదనంగా ఏర్పాటు చేశారు. 3 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 2290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఎన్నికల వేళ మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ (మంగళవారం) సాయంత్రం ఐదు గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు షాపులన్నీ క్లోజ్ చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ మేరకు వైన్స్, బార్లు మూసివేయనున్నారు. ఒక వేళ రూల్స్ అతిక్రమించి విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలతోపాటు లైసెన్స్ రద్దు చేస్తామని కూడా ఎక్సైజ్ శాఖ హెచ్చరిచింది.
మరోవైపు పోలింగ్ డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ ఇవాళ కూడా ఇవ్వబోతున్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇంతకుముందు పోస్టల్ బ్యాలెట్ జారీ కాలేదని కన్ఫామ్ చేసుకున్న తర్వాత పోస్టల్ బ్యాలెట్ అందజేసి ఓటింగ్ పెసిలిటీ కల్పించాలన్నారు.
బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిస్సిగ్గుగా ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తపల్లిలో తనను కలిసిన మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. తాను పోలింగ్ ప్రచారం ముగిశాక మా స్థానిక నాయకుడు వాసాల రమేశ్ నివాసానికి టీ తాగేందుకు వెళ్లిన… అక్కడికి వెళ్లాక మా కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు కొత్తపల్లిలో డబ్బులు పంచుతున్నారని సమాచారం ఇచ్చారు. దాదాపు 3 గంటల నుండి అడ్డగోలుగా డబ్బులు పంచుతుంటే మా కార్యకర్తలు అడ్డుకుంటే మా వాళ్లపై దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కరీంనగర్ లో ఓటుకు రూ.10 వేలు పంచిన బీఆర్ఎస్- ఆధారాలు చూపించిన బండి సంజయ్
రీంనగర్ నియోజకవర్గంలో పోలీసులు సైతం ఓటర్లకు నగదు పంపిణీ చేశారని ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ అనే వ్యక్తిని ఓడించడం కుదరక, బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులతో ఒక్కో ఓటరుకు రూ.10 వేలు పంపినీ చేశారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. పోలీసులకు సమాచారం అందించినా నగదు పంపిణీ దాదాపు నాలుగు గంటలు కొనసాగిందన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా, ఓటర్లకు డబ్బులు పంచి నెగ్గడమే సీఎం కేసీఆర్ కు తెలిసిన రాజకీయమా అని ప్రశ్నించారు. బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి తీసుకున్న ఓటర్ల జాబితా పేపర్ తీసుకుని పరిశీలించి, నగదు పంపిణీ చేసిన వారికి పెయిడ్ అని టెక్ పెట్టారని సంచలన విషయాలు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో కొందరి పేర్లకు డబుల్ పెయిడ్ అని సైతం రాసి ఉందంటూ మీడియాకు పలు విషయాలు వెల్లడించారు.
Vikas Raj Press Meet: పోలింగ్ రోజు సెలవు ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు - వికాస్ రాజ్ హెచ్చరికలు
నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజున అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Telangana CEO Vikas Raj) సూచించారు. ఎన్నికలు జరిగే రోజున తెలంగాణలోని అన్ని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ కంపెనీలు హాలిడే ప్రకటించాలన్నారు. సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా చదవండి
Kalvakuntla Kavitha News: కవిత దెబ్బకు ఆ ప్రాంతంలో బీజేపీ ఖాళీ
ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్ధతు కూడగట్టడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని ప్రచారం చేశారు. నెల రోజులకుపైగా నిజామాబాద్ లోనే బస చేసిన ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని 10 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. నిజామాబాద్ అర్బన్, బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్ధతుగా ఏర్పాటు చేసిన సభలు, సమావేశాలకు హాజరయ్యి ప్రసంగించారు. ఇంకా చదవండి
తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు
తెలంగాణలో గత రెండు నెలలుగా దద్దరిల్లిన మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం నేడు (నవంబరు 28) సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ముందు 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 4 గంటలకే ప్రచారం ముగిసింది. ఆ నియోజకవర్గాల్లో సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగిసిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఎల్లుండి (నవంబరు 30) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3 న కౌంటింగ్ జరిగి ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.