Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్ రాజ్
Holiday on Telangana Elections Day: నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజున అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు.
Holiday For Telangana Elections 2023: హైదరాబాద్: నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజున అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ (Telangana CEO Vikas Raj) సూచించారు. ఎన్నికలు జరిగే రోజున తెలంగాణలోని అన్ని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ కంపెనీలు హాలిడే ప్రకటించాలన్నారు. సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గతంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని ఐటీ, ప్రైవేట్ కంపెనీలు సెలవు ఇవ్వలేదని తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల రోజున సంస్థలు సెలవులు ఇవ్వకపోవడంతో ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నవంబర్ 30న ఎన్నికల రోజు అన్ని సంస్థలు హాలిడే ఇస్తున్నాయో లేదో పరిశీలించి, సెలవు ఇవ్వని కంపెనీ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.
ఆ విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 29, 30 తేదీల్లో పాఠశాలలకు (school holidays) ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబరు 30న రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరగనుంది. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబరు 29న ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. డిసెంబర్ 1న మళ్లీ స్కూళ్లు, కాలేజీలూ తెరచుకోనున్నాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply