అన్వేషించండి

MLC Kavitha News: ఎమ్మెల్సీ కవిత దెబ్బకు అక్కడ బీజేపీ అంతా ఖాళీ! 70కి పైగా రోడ్ షోలు, యాత్రలు

70కి పైగా రోడ్ షోలు, పాదయాత్రలు, స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, బహిరంగ సభలు, ఆయా సంఘాలు నిర్వహించిన సమావేశాల్లో పాల్గొని కల్వకుంట్ల కవిత ప్రచారాన్ని హోరెత్తించారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్ధతు కూడగట్టడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలుపెరగని ప్రచారం చేశారు. నెల రోజులకుపైగా నిజామాబాద్ లోనే బస చేసిన ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని 10 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. నిజామాబాద్ అర్బన్, బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్ధతుగా ఏర్పాటు చేసిన సభలు, సమావేశాలకు హాజరయ్యి ప్రసంగించారు. 

70కి పైగా రోడ్ షోలు, పాదయాత్రలు, స్ట్రీట్ కార్నర్ సమావేశాలు, బహిరంగ సభలు, ఆయా సంఘాలు నిర్వహించిన సమావేశాల్లో పాల్గొని హోరెత్తించారు. కుల సంఘాల సమ్మేళనాలు, యువ, మహిళా, కార్మికుల సమ్మేళనాలలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ గారు చేస్తున్న మంచి పనులకు గానూ కారు గుర్తుకు ఎందుకు ఓటేయాలో ప్రజలకు అర్థమయ్యే తీరులో చక్కగా వివరించారు. సీఎం కేసీఆర్ సంక్పలించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించే కాకుండా రాజకీయ పరిస్థితులపై ప్రజలకు చైతన్యం కలిగించేలా సభలు, సమావేశాల్లో మాట్లాడారు. 

కాంగ్రెస్, బీజేపీ పార్టీలను సమర్థంగా ఎండగట్టిన కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల వైఫల్యాలను సమర్థంగా ఎండగట్టారు. తమ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలు, ఆరోపణలకు దీటుగా సమాధానాలు ఇచ్చారు. పదునైన మాటలతో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని 55 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది శూన్యం అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఉదాహరణలతో సహా కాంగ్రెస్ పాలనను గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చి చెప్పడం ప్రజలను ఆకర్శించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధర పెంపు, నిత్యవసర వస్తువుల ధరలను పెంచడం వంటి అంశాలపై ప్రజాక్షేత్రంలో నిలదీశారు. ఆ రెండు పార్టీల వైఫల్యాలను ఎండగతూనే బీఆర్ఎస్ మెనిఫెస్టోను, గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల వల్ల కలిగిన ప్రయోజనాలు, అభివృద్ధిపై తనదైన శైలిలో ఆసక్తికరంగా వివరించడం విశేషం. అలాగే, కవిత గారి ప్రసంగాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నాయి. పెన్షన్ల నుంచి ఉద్యోగ నియామకాలు, అభివృద్ధి ఇలా అన్ని అంశాలపై సమగ్ర అవగాహనతో ప్రసంగాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యువతకు స్పూర్తి నింపారు. 

ఎమ్మెల్సీ కవిత సభలకు భారీగా పోటెత్తిన మహిళలు

ఎమ్మెల్సీ పాల్గొన్న ప్రతి సభలు, రోడ్ షోలు, సమావేశాలకు మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలిరావడం గమనార్హం. మహిళలకు, యువత కవిత పట్ల ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. అనేకసార్లు కవిత రోడ్ షోలు, సభలు ముగిసిన వెంటనే వేదిక దిగి నేరుగా మహిళల మధ్యకు వెళ్లి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వారు కూడా కవితని పలకరించారు. అదే విధంగా యువత కూడా కవిత ప్రచార కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఏ గ్రామానికి వెళ్లినా కవితకు ఘనస్వాగతం లభించింది.

కవిత సమక్షంలో చేరికలు, బీజేపీ ఖాళీ 

ప్రచార కార్యక్రమాల సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన కవిత కోరుట్ల టౌన్ బీజేపీ అధ్యక్షుడు, ఇద్దరు కౌన్సిలర్లతో పాటు దాదాపు 200 మంది కార్యకర్తలను పార్టీలో చేర్చుకున్నారు. ఆ నియోజకవర్గంలో బీజేపీ ఖాళీ అయిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ పెద్ద సంఖ్యలో యువత కవిత సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget