Dies Irae Collection : 50 కోట్ల క్లబ్‌లో మోహన్ లాల్ కొడుకు మూవీ - అదరగొట్టిన హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'... తెలుగులోనూ రెడీ
Dies Irae Movie Collection : రీసెంట్ మలయాళ హారర్ మిస్టరీ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' వారం రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ తెలుగులో శుక్రవారం రిలీజ్ కానుంది.

Pranav Mohanlal's Dies Irae First Week Collection : మలయాళ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన రీసెంట్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'. అక్టోబర్ 31న మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. 'భూతకాలం', 'భ్రమయుగం' వంటి మూవీస్‌తో ఆకట్టుకున్న రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా... వారం రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్ సాధించింది.
రూ.50 కోట్ల క్లబ్‌లో...
రిలీజ్ అయిన వారం రోజుల్లోపే 'డీయస్ ఈరే' రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. మరికొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుకోవడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ మూవీ తెలుగు వెర్షన్ శుక్రవారం (నవంబర్ 7) రిలీజ్ కానుంది. తెలుగులోనూ అదే జోష్ కొనసాగిస్తే అతి త్వరలోనే రికార్డు కలెక్షన్స్ సాధించడం ఖాయమంటూ కామెంట్స్ వస్తున్నాయి.
మూవీలో ప్రణవ్‌తో పాటు సుష్మితా భట్, అరుణ్ అజికుమార్, జిబిన్ గోపీనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ స్రవంతి మూవీస్ అధినేత రవికిశోర్ విడుదల చేస్తున్నారు.
View this post on Instagram
Also Read : అట్లీ మూవీతో పాన్ వరల్డ్ రేంజ్ - అల్లు అర్జున్ ప్లానింగ్ మామూలుగా లేదు... రాజమౌళితో కూడా!
థ్రిల్లర్ స్టోరీ ఏంటంటే?
రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) ఓ ఆర్కిటెక్. ఆయన తండ్రి ఓ ఫేమస్ బిజినెస్ మ్యాన్. పేరెంట్స్ ఇద్దరూ ఆమెరికాలో ఉంటే ఫ్రెండ్స్‌తో పార్టీలు, సరదాలు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు రోహన్. ఓ రోజు తన ఫ్రెండ్ కణి (సుష్మితా భట్) ఆత్మహత్య చేసుకుందని తెలిసి వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించి వస్తాడు. అయితే, ఆ తర్వాత నుంచి అతని జీవితంలో మార్పులు వస్తాయి. తనను ఏదో వెంటాడుతున్న ఫీలింగ్ రోహన్‌కు కలుగుతుంది.
ఇక తన ఫ్రెండ్ కణి ఆత్మే తన వెంట వచ్చిందని భావిస్తాడు రోహన్. ఆమె ఇంటికి వెళ్లి వచ్చినప్పటి నుంచే తనకు ఇలా జరుగుతుందంటూ ఫీల్ అవుతాడు. ఈ క్రమంలో కణి పక్కింట్లో ఉండే మధు (జిబిన్ గోపినాథ్) సాయం కోరతాడు. ఇదే టైంలో కణి తమ్ముడు కిరణ్ (అరుణ్ అజికుమార్) రోహన్ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రోహన్ వెంట నిజంగానే కణి ఆత్మ వచ్చిందా? ఫిలిప్ ఎవరు? ఆత్మ ఎందుకు ఇదంతా చేస్తుంది? నిజంగా ఆత్మ వల్లే ఇలా జరుగుతుందా? లేక మరెవరైనా కారణమా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















