అన్వేషించండి

Assembly Elections Polling 2026:తమిళనాడు, బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం! రాజకీయ దిగ్గజాల భవితవ్యం నిర్ణయిస్తున్న ఓటర్లు!

తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులో మొత్తం 234 సీట్లలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. బెంగాల్‌లో 152 స్థానాల్లో మొదటి విడత ఓటింగ్ జరుగుతోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
  • తమిళనాడులో 234, బెంగాల్‌లో 152 స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది.
  • తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య పోటీ నెలకొంది.
  • పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
  • ఎన్నికల సంఘం నిష్పక్షపాత పోలింగ్ కోసం పటిష్ట చర్యలు చేపట్టింది.

Assembly Elections Polling 2026:ఏప్రిల్ 23 గురువారం నాడు దేశంలోని రెండు పెద్ద రాష్ట్రాలు అయిన తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  . బెంగాల్‌ మొదటి విడతలో 152 స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఈ రెండు రాష్ట్రాలతోపాటు అసోం, పుదుచ్చేరీ, కేరళ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. 

తమిళనాడులో ప్రస్తుతం అధికారం డీఎంకే, అన్నాడీఎంకే కూటమి మధ్య పోటీ నెలకొంది. అయితే ఈసారి నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే రాకతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. మొత్తం 5. 73 కోట్ల మంది ఓటర్లు 4, 023 మంది అభ్యర్థుల భవిష్యత్‌ను తేల్చనున్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. సుమారు 3.22 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నాలుగోసారి అధికారంలోకి రావాల లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 77 స్థానాలతో బలపడిన బీజేపీ నౌ ఆర్ నెవర్ అన్న రీతిలో పోరాడుతోంది. 

2021 ఎన్నికల్లో టీఎంసీ 213 స్థానాలను గెలుచుకొని చారిత్రాత్మక విజయం సాధించింది. లక్ష్మీ బండార్ వంటి సంక్షేమ పథకాలు మహిళా ఓటర్లను టీఎంసీ వైపు తిప్పడంలో కీలకంగా మారాయి. మరోవైపు తమిళనాడులో 2021లో డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. స్ఠాలిన్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈసారి ఓట్ల గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తమిళనాడులో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 234 నియోజకవర్గాల్లో 215 చోట్ల మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు. 

తమిళనాడులో కీలక అభ్యర్థులు

ఎంకేస్టాలిన్- కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 
ఉదయనిధి స్టాలిన్- తిరువల్లికేణి స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తున్నారు
 విజయ్‌- టీవీకే పార్టీ తరఫున తిరుచిరాపల్లి ఈస్ట్ , పెరంబూర్‌ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. 

ఎడప్పాడి పళనిస్వామి- ఎడప్పాడి నియోజకవర్గం నుంచి నాలుగో సారి విజయం సాధించాలని భావిస్తున్నారు. 
పన్నీర్ సెల్వం- ఆయన డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుంచి పోటీ చేస్తున్నారు. 

పశ్చిమ బెంగాల్‌లో బిగ్ హెడ్స్‌

మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ టీఎంసీకి వెన్నెముకగా నిలుస్తున్నారు. బీజేపీ తరఫున నువేందు అధికకారి, సుకాంత మజుందార్‌, సమిక్ భట్టాచార్య వంటి నేతలు ప్రచారాన్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్, సీపీఎం కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నాయి. 

ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు తీసుకుంది. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టడానికి తరలిస్తున్న వెయ్యి కోట్ల నగదు, మద్యం ఇతర వస్తువులను బెంగాల్, తమిళనాడులో స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో వందల సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో స్పందించేలా వేలకుపైగా ఫ్లయింగ్ స్క్వాడ్‌ బృందాలను రంగంలోకి దించారు. రాత్రి వేళల్లో వాహనాల కదలికలపై ఆంక్షలు విధించారు.మోటార్ సైకిల్ ర్యాలీలను పూర్తిగా నిషేధించారు.                   

Frequently Asked Questions

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?

ఏప్రిల్ 23 గురువారం నాడు దేశంలోని రెండు పెద్ద రాష్ట్రాలు అయిన తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

తమిళనాడులో మొత్తం ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి?

తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. మొత్తం 5. 73 కోట్ల మంది ఓటర్లు 4, 023 మంది అభ్యర్థుల భవిష్యత్‌ను తేల్చనున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ఎన్ని విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి?

పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో 152 స్థానాలకు ఓటింగ్ జరిగింది. మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది.

తమిళనాడులో ఈసారి ఎన్నికల పోటీని మరింత రసవత్తరంగా మార్చిన పార్టీ ఏది?

నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రాకతో తమిళనాడులో ఎన్నికల పోటీ మరింత రసవత్తరంగా మారింది.

పశ్చిమ బెంగాల్‌లో ఏ పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి?

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. సుమారు 3.22 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
Embed widget