అన్వేషించండి

Vijaya Sankalpam: తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం, రేపటి నుంచి విజయసంకల్పం పేరిట రథ యాత్రలు

Bjp Pracharam: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న బీజేపీ, విజయసంకల్ప యాత్రల పేరిట రేపటి నుంచి రథయాత్రలు, నేడు ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

BJP Yathra: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో  తెలంగాణలో బీజేపీ(BJP) సైతం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటి నుంచి జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తమకు తొలి నుంచీ కలిసొచ్చే హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసేందుకు బీజేపీ రథయాత్రలకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో... ఈసారి లోక్ సభ ఎన్నికలపై ప్రత్యేకంగా కమలం పార్టీ దృష్టి సారించింది. కొత్త సీట్ల సంగతి ఎలా ఉన్నా...గతంలో గెలిచిన చోట్ల సీట్లు చేజారిపోకుండా హిందూకార్డును ప్రయోగిస్తోంది..

రేపటి నుంచి రథయాత్రలు   
ఎన్నికలు వచ్చాయంటే హిందూఓట్లకు ఎరవేయడంలో బీజేపీ(BJP) ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఆపార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అద్వానీ(Advani) దేశవ్యాప్తంగా రథయాత్ర చేపట్టి..తొలిసారి ఆ పార్టీని దిల్లీ గద్దెనెక్కించారు. ఇప్పుడు తెలంగాణ(Telangana)లోనూ కమలం పార్టీ అదే ఫార్ములా ప్రయోగిస్తోంది. ఈనెల 20 నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ రథయాత్రలకు శ్రీకారం చుట్టింది. నేడు చార్మినార్(Charminar) భాగ్యలక్ష్మీ ఆలయం(Bhagya Lakshimi Temple)లో ప్రచార వాహనాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పూజలు చేసి ప్రారంభించనున్నారు. 5 క్లస్టర్లుగా 16 ఎంపీ సెగ్మెంట్‌లలో జరిగే ఈ రథయాత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు.

ఎంపీ సీట్లపై కన్ను
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన బీజేపీ...దేశవ్యాప్తంగా ఎంపీసీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పైగా ఎన్డీఏ 400 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈక్రమంలో ఎట్టిపరిస్థితుల్లోనూ  తెలంగాణలో పది ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ కేంద్ర అధినాయకత్వం రాష్ట్ర నేతలను ఆదేశించింది.  అందులో భాగంగానే  విజయ సంకల్ప రథయాత్రలకు ఆ పార్టీ శ్రీకారం చుడుతోంది. ఈ నెల 20 నుంచి నాలుగు చోట్ల నుంచి ఈ రథయాత్రల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ యాత్రలు మార్చి 1న ముగించేలా ఏర్పాట్లు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద జరిగి ప్రచార రథాల పూజా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు ఎంపీలు బండి సంజయ్(Bandi Sanjay), లక్ష్మణ్(Laxman), ఈటెల రాజేందర్(Etela Rajendra) సహా పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. 

క్లస్టర్ల విభజన
హైదరాబాద్ మినహాయించి 16 ఎంపీ స్థానాలను ఐదు క్లష్టర్లుగా రాష్ట్రాన్ని విభజించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలు ఉండనున్నాయి. ఈ ఐదు క్లష్టర్లకు తెలంగాణలోని చారిత్రక ప్రదేశాల పేర్లు పెట్టారు. 
భాగ్యలక్ష్మీ క్లస్టర్: ఈ కస్టర్ పరిధిలో మూడు ఎంపీ సెగ్మెంట్లు రానున్నారు. రేపు భువనగిరిలో ప్రారంభం కానున్న రథయాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ  హైదరాబాద్ లోయాత్ర ముగియనుంది. 
కొమురం భీం క్లస్టర్‌:  ఈక్లస్టర్ పరిధిలోనూ రేపే యాత్ర ప్రారంభంకానుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ముథోల్‌లోమొదలుకానుంది. ఈ కార్యక్రమానికి  అస్సోం సీఎం హిమంతబిశ్వ శర్మ హాజరుకానున్నారు. ఈ యాత్ర సైతం 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ముగుస్తుంది 
రాజరాజేశ్వరి క్లస్టర్‌: వికారాబాద్‌ జిల్లా తాండూరులో రేపు ఈ రథయాత్రను  గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రారంభించనున్నారు. 4 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలో ని 28 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ కరీంనగర్‌లో యాత్ర ముగియనుంది.
కృష్ణమ్మ క్లస్టర్‌ : నారాయణపేట జిల్లా మక్తల్‌లో రేపు ప్రారంభం కానున్న రథయాత్ర 3 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నల్లగొండలో ముగుస్తుంది
కాకతీయ–భద్రకాళి యాత్ర : ఇది ఈ నెల 25వ తేదీన భద్రాచలంలో ప్రారంభమై 3 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలోని  21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ ములుగులో ముగుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget