అన్వేషించండి

Anantapur District News: అనంతపురం జిల్లాలోని అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే

Anantapur News: అనంతపురం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల లెక్క తేలింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి.

Andhra Pradesh News: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల లెక్క తేలింది. ఇటు వైసీపీ, అటు కూటమి నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులను ఖరారు చేయడంతో ఇక్కడ పోటీ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార వైసీపీతోపాటు కూటమి కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఆర్థికంగా, సామాజికంగా ఇరు వైపుల నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగడంతో అనేక నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా సాగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోకజవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే..

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం(Madakasira Assembly constituency) నుంచి వైసీపీ అభ్యర్థిగా ఈర లక్కప్ప(Eera Lakkappa ) పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఎంఈ సునీల్‌ కుమార్‌ (M.E.Sunil Kumar)బరిలోకి దిగతున్నారు. శింగనమల నియోజకవర్గం(Singanamala Assembly constituency) నుంచి వైసీపీ నుంచి మన్నెపాకుల వీరాంజనేయులు బరిలోకి దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బండారు శ్రావణి పోటీ చేస్తున్నారు. కల్యాణ దుర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తలారి రంగయ్య పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి అమిలినేని సురేంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వై విశ్వేశ్వరరరెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పోటీ చేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పరిటాల సునీత పోటీ చేస్తున్నారు. 

అనంతపురం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా 

నియోజకవర్గం పేరు  వైసీపీ అభ్యర్థి పేరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరు 
మడకశిర (Madakasira Assembly constituency) ఈర లక్కప్ప(Eera Lakkappa) సునీల్‌ కుమార్‌(టీడీపీ)Sunil Kumar (TDP)
శింగనమల (singanamala assembly constituency ) మన్నెపాకుల వీరాంజనేయులు(Mannepakula Veeranjaneyulu) బండారు శ్రావణి(టీడీపీ) (Bandaru Sravani) (TDP)
కల్యాణ దుర్గం (Kalyandurg assembly constituency) తలారి రంగయ్య(Talari Rangaiah) అమిలినేని సురేంద్రబాబు (Amilineni Surendra Babu)(TDP)
ఉరవకొండ (Uravakonda assembly constituency) విశ్వేశ్వరరరెడ్డి(Visweswara Reddy) పయ్యావుల కేశవ్‌(Payyavula Keshav)(TDP)
రాప్తాడు (Raptadu assembly constituency) తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి(Topudurthi Prakash Reddy) పరిటాల సునీత (Paritala Sunitha) (TDP)

పెనుకొండ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి కేవీ ఉష శ్రీ చరణ్‌ పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన కురుబ సవిత పోటీ చేస్తున్నారు. తాడిపత్రి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. గుంతకల్లు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వై వెంకట రామిరెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం పోటీ చేస్తున్నారు. ఈయన వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి మంత్రిగా పని చేశారు. కొద్దిరోజులు కిందట టీడీపీలో చేరి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గ ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాయదుర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కాలువ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. 

అనంతపురం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా 

నియోజకవర్గం పేరు  వైసీపీ అభ్యర్థి పేరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరు 
పెనుకొండ(Penukonda Assembly constituency) కేవీ ఉష శ్రీ చరణ్‌(K. V. Ushashri Charan) కురుబ సవిత(టీడీపీ) (Savitha Kuruba (TDP))
తాడిపత్రి(Tadpatri Assembly constituency) కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Pedda Reddy) జేసీ అస్మిత్‌ రెడ్డి(టీడీపీ)(J C Ashmit Reddy (TDP))
గుంతకల్లు(Guntakal Assembly constituency) వెంకట రామిరెడ్డి(Venkatarami Reddy) గుమ్మనూరు జయరాం(టీడీపీ)(Gummanur Jayaram (TDP))
రాయదుర్గం(Rayadurg assembly constituency) మెట్టు గోవిందరెడ్డి(Mettu Govinda Reddy) కాలువ శ్రీనివాసులు(టీడీపీ)(Kalava Srinivasulu (TDP))

హిందూపురం నుంచి కూటమి అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ముచ్చటగా మూడోసారి విజయం దక్కించుకునేందుకు ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. వైసీపీ అభ్యర్థిగా టీఎన్‌ దీపికను బరిలోకి దించుతున్నారు. పుట్టపర్తి నుంచి దుద్దుకుంట్ల శ్రీధర్‌ రెడ్డి వైసీపీ నుంచి బరిలోకి దిగుతుండగా, టీడీపీ నుంచి పల్లె సింధూరరెడ్డి పోటీ చేస్తున్నారు. ధర్మవరం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి వై సత్యకుమార్‌ బరిలోకి దిగుతున్నారు. కదిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా మక్బూల్‌ అహ్మద్‌ పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కందింకుట యశోదా పోటీ చేస్తున్నారు. అనంతపురం అర్బన్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. 

అనంతపురం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా 

నియోజకవర్గం పేరు  వైసీపీ అభ్యర్థి పేరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరు 
హిందూపురం(Hindupur Assembly constituency) టీఎన్‌ దీపిక(T. N. Deepika) నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)
పుట్టపర్తి(Puttaparthi Assembly constituency) దుద్దుకుంట్ల శ్రీధర్‌ రెడ్డి(Duddukunta Sridhar Reddy) పల్లె సింధూరరెడ్డి(Palle Sindhura Reddy)
ధర్మవరం(Dharmavaram Assembly constituency) కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) వై సత్యకుమార్‌(Satya Kumar Y)
కదిరి(Kadiri Assembly constituency) మక్బూల్‌ అహ్మద్‌(B. S. Maqbool Ahmed) కందింకుట యశోదా(Kandikunta Yashoda)
అనంతపురం అర్బన్‌(Anantapur Urban Assembly constituency) అనంత వెంకట రామిరెడ్డి(Anantha Venkatarami Reddy)

దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ (Daggubati Venkateswara Rao)

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
KL Rahul Century: గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం

వీడియోలు

Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?
Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
KL Rahul Century: గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
గిల్ హాఫ్ సెంచరీ, శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాజ్‌కోట్‌లో కివీస్ టార్గెట్ ఎంతంటే
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
Chennai sanitation worker: జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
జీవితాంతం రోడ్లు ఊడ్చినా రానంత సొమ్ము ఒకే సారి దొరికింది - కానీ ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా?
Sankranti celebrations: కోడి పందేలతో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు - ఎక్కడ చూసినా బరులే!
కోడి పందేలతో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు - ఎక్కడ చూసినా బరులే!
Siddaramaiah Controversy: జర్మనీ చాన్సలర్‌కు అగౌరవం - రాహుల్‌కే గౌరవం - మరో వివాదంలో సిద్ధరామయ్య!
జర్మనీ చాన్సలర్‌కు అగౌరవం - రాహుల్‌కే గౌరవం - మరో వివాదంలో సిద్ధరామయ్య!
Ola Electric: ఒక్క సారి చార్జ్ చేస్తే 501 కి.మీ - ఎలక్ట్రిక్ బైక్ సెన్సేషన్ - ఇవిగో ఫుల్ డీటైల్స్
ఒక్క సారి చార్జ్ చేస్తే 501 కి.మీ - ఎలక్ట్రిక్ బైక్ సెన్సేషన్ - ఇవిగో ఫుల్ డీటైల్స్
Embed widget