News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

OU UCE: ఓయూ యూసీఈలో ఎంఈ, ఎంటెక్‌ కోర్సులు, వివరాలు ఇలా

హైదరాబాద్‌లోని ఓయూ సీఈఈపీ, యూసీఈ 2023-2024 విద్యా సంవత్సరానికి ఇండస్ట్రీ స్పాన్సర్డ్/ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఉద్దేశించిన ఎంఈ, ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

హైదరాబాద్‌లోని ఓయూ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(సీఈఈపీ), యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (యూసీఈ) 2023-2024 విద్యా సంవత్సరానికి ఇండస్ట్రీ స్పాన్సర్డ్/ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఉద్దేశించిన ఎంఈ, ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుతోపాటు, దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 

వివరాలు..

* ఎంఈ, ఎంటెక్‌ (సీఈఈపీ) (ఇండస్ట్రీ స్పాన్సర్డ్/ వర్కింగ్ ప్రొఫెషనల్స్)

సీట్ల సంఖ్య: 90.

విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మైనింగ్.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.

అనుభవం: ఇండస్ట్రీ/ ఎడ్యుకేషన్‌/ రిసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ రంగాల్లో ఏడాది అనుభవం ఉండాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

కౌన్సెలింగ్ తేదీ: 30.09.2023.

సమయం: ఉదయం 10.30 గంటల నుంచి. ఉదయం 11 గంటల్లోగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుతోపాటు, దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

వేదిక: Assembly Hall, Main Building,UCE(A), OU, Hyderabad.

Notification

Applicatation 

Website  

ALSO READ:

సీపీగెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇలా
తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కామన్ పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్) కౌన్సెలింగ్ షెడ్యూల్ పూర్తిగా మారింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను కన్వీనర్ ఆచార్య ఎల్.పాండురంగారెడ్డి శుక్రవారం (సెప్టెంబరు 15న) విడుదల చేశారు. సీపీగెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 5న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మొదట రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబరు 15గా నిర్ణయించగా... తాజాగా ఆ గడువును సెప్టెంబరు 22 వరకు పొడిగించారు. మహాత్మాగాంధీ, కాకతీయ వర్సిటీల బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల ఫలితాలు ఇంకా వెలువడకపోవడంతో ఈ మార్పు చేసినట్లు తెలిసింది. శుక్రవారం వరకు మొత్తం 30 వేల మంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు.
పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

అంబేడ్కర్ 'దూరవిద్య' డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించిన ప్రవేశ గడువును పెంచిన యూనివర్సిటీ మరోసారి 15 రోజులపాటు పొడిగించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

TS EdCET: టీఎస్ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో బీఈడీ (BEd) కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 14న విడుదల చేసింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేష‌న్‌ సెప్టెంబరు 19న విడుద‌ల చేయ‌నున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎడ్‌సెట్ ప్రవేశాల‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను సెప్టెంబరు 20 నుంచి 30 లోపు న‌మోదు చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 16 Sep 2023 05:54 PM (IST) Tags: Osmania University Education News in Telugu university college of engineering OU Admissions ME and MTech courses

ఇవి కూడా చూడండి

Telangana Group 1 :    గ్రూప్ 1 ప్రిలిమ్స్  రద్దు ఖాయం   - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !

Telangana Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఖాయం - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !

TS TET 2023 Results: తెలంగాణ 'టెట్‌' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే

TS TET 2023 Results: తెలంగాణ 'టెట్‌' ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే

TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్‌' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

TS TET 2023 Results: 27న తెలంగాణ 'టెట్‌' ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

NIMS: 'నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

NIMS: 'నిమ్స్‌'లో ఫిజియోథెరపీ పీజీ కోర్సులో ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు

PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూ‌ల్‌లో స్వల్ప మార్పులు

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?