అన్వేషించండి

CPGET: సీపీగెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇలా

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న సీపీగెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ పూర్తిగా మారింది. కొత్త షెడ్యూలును అధికారులు విడుదల చేశారు.

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కామన్ పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్) కౌన్సెలింగ్ షెడ్యూల్ పూర్తిగా మారింది. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను కన్వీనర్ ఆచార్య ఎల్.పాండురంగారెడ్డి శుక్రవారం (సెప్టెంబరు 15న) విడుదల చేశారు.

సీపీగెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 5న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మొదట రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబరు 15గా నిర్ణయించగా... తాజాగా ఆ గడువును సెప్టెంబరు 22 వరకు పొడిగించారు. మహాత్మాగాంధీ, కాకతీయ వర్సిటీల బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల ఫలితాలు ఇంకా వెలువడకపోవడంతో ఈ మార్పు చేసినట్లు తెలిసింది. శుక్రవారం వరకు మొత్తం 30 వేల మంది రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారు.

కొత్త షెడ్యూలు ఇలా..

* రిజిస్ట్రేషన్: 05.09.2023 - 22.09.2023.

* సర్టిఫికేట్ వెరిఫికేషన్ ధ్రువీకరణ: 23.09.2023.

* వెబ్‌ఆప్షన్ల నమోదు: 23.09.2023 - 26.09.2023.

* వెబ్‌ఆప్షన్ల సవరణ: 26.09.2023.

* మొదటి విడత సీట్ల కేటాయింపు: 29.09.2023.

* సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 04.10.2023 లోగా.

* రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 06.10.2023. 

CPGET: సీపీగెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇలా

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీహెచ్‌లోని పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఆగస్టు 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మొత్తం 93.42 శాతం మంది అర్హత సాధించారు. 

కాగా, సీపీగెట్-2023 పరీక్షలను జూన్‌ 30 నుంచి జూలై 10 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు 22,468 మంది పురుషులు, 45,954 మంది మహిళలు సహా మొత్తం 68,422 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 19,435 మంది పురుషులు, 40,230 మంది మహిళలు సహా మొత్తం 59,665 మంది పరీక్షలు రాశారు. వారిలో 18,172 మంది పురుషులు, 37,567 మంది మహిళలు సహా మొత్తం 55,739 మంది క్వాలిఫై అయ్యారు. 

ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీలతోపాటు హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో పీజీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.

ALSO READ:

అంబేడ్కర్ 'దూరవిద్య' డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు పొడిగించిన ప్రవేశ గడువును పెంచిన యూనివర్సిటీ మరోసారి 15 రోజులపాటు పొడిగించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

TS EdCET: టీఎస్ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో బీఈడీ (BEd) కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 14న విడుదల చేసింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేష‌న్‌ సెప్టెంబరు 19న విడుద‌ల చేయ‌నున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎడ్‌సెట్ ప్రవేశాల‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను సెప్టెంబరు 20 నుంచి 30 లోపు న‌మోదు చేయాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

టీఎస్ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో బీపీఈడీ, డీపీఈడీకోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన 'టీఎస్‌ పీఈసెట్-2023' ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 14న విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని 16 బీపీఎడ్ కాలేజీల్లో 1660 సీట్లు, నాలుగు డీపీఎడ్ కాలేజీల్లో 350 సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. పీఈసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమంట్ ప్రక్రియ సెప్టెంబరు 20 నుంచి 25 వరకు కొనసాగనుంది.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget