అన్వేషించండి

TS EdCET: టీఎస్ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌, ముఖ్యమైన తేదీలివే!

తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 14న విడుదల చేసింది. కౌన్సెలింగ్‌ పూర్తి నోటిఫికేష‌న్‌ సెప్టెంబరు 19న విడుద‌ల చేయ‌నున్నారు.

తెలంగాణలో బీఈడీ (BEd) కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 14న విడుదల చేసింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేష‌న్‌ సెప్టెంబరు 19న విడుద‌ల చేయ‌నున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎడ్‌సెట్ ప్రవేశాల‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను సెప్టెంబరు 20 నుంచి 30 లోపు న‌మోదు చేయాల్సి ఉంటుంది.

ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ వెరిఫికేష‌న్ సెప్టెంబరు 25 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు అక్టోబ‌ర్ 3 నుంచి 5 వ‌ర‌కు వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. అక్టోబ‌ర్ 6న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు అక్టోబ‌ర్ 9న మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబ‌ర్ 10 నుంచి 13 మ‌ధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అక్టోబరు 30 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి.

టీఎస్ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్‌ తేదీలు: సెప్టెంబరు 20 నుంచి 30 వరకు

➥ ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థుల‌కు ఫిజిక‌ల్ వెరిఫికేష‌న్: సెప్టెంబరు 25 నుంచి 29 వరకు.

➥ వెబ్ ఆప్షన్ల న‌మోదు: అక్టోబ‌ర్ 3 నుంచి 5 వ‌ర‌కు. 

➥  వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం: అక్టోబ‌ర్ 6. 

➥ మొదటి విడత సీట్ల కేటాయింపు: అక్టోబ‌ర్ 9న. 

➥ కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: అక్టోబ‌ర్ 10 నుంచి 13 వరకు. 

➥  త‌ర‌గ‌తులు ప్రారంభం: అక్టోబరు 30 నుంచి.

తెలంగాణలో బీఈడీ ప్రవేశాల కోసం మే 18న నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు జూన్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఈ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరుకాగా.. మొత్తం 26,994 అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 211 ప్రభుత్వ, ప్రైవేట్‌ బీఈడీ కళాశాలల్లో మొత్తం 18,350 సీట్లకుగాను.. 13,756 మంది అభ్యర్థులు ప్రవేశాలు పొందారు.

ALSO READ:

నేషనల్ ఓపెన్ స్కూల్ ప్రాక్టికల్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోండి
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) 10, 12వ తరగతుల ప్రాక్టికల్ పరీక్షల హాల్‌టికెట్లను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. విద్యార్థులకు తమ ఎన్‌రోల్‌మెంట్ నెంబరు, పరీక్ష వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 16 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా థియరీ పరీక్షల హాల్‌టికెట్లను సెప్టెంబరు చివరివారంలో విడుదల చేయనున్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
Cloud Kitchen : మీరు వంట బాగా చేస్తారా? అయితే తక్కువ ఖర్చుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించవచ్చు
మీరు వంట బాగా చేస్తారా? అయితే తక్కువ ఖర్చుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించవచ్చు
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
Cloud Kitchen : మీరు వంట బాగా చేస్తారా? అయితే తక్కువ ఖర్చుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించవచ్చు
మీరు వంట బాగా చేస్తారా? అయితే తక్కువ ఖర్చుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించండి.. లక్షల్లో సంపాదించవచ్చు
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Knee Replacement : మోకాలి మార్పిడి చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి
మోకాలి మార్పిడి చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
26 కొత్త సంవత్సరం సంతోషంగా గడిచిపోవాలా? అయితే ఈ వాస్తు సూత్రాలు అనుసరించి చూడండి!
2026 కొత్త సంవత్సరం సంతోషంగా గడిచిపోవాలా? అయితే ఈ వాస్తు సూత్రాలు అనుసరించి చూడండి!
Embed widget