News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TS PECET: టీఎస్ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌, ముఖ్యమైన తేదీలివే!

తెలంగాణలో బీపీఈడీ, డీపీఈడీకోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన టీఎస్‌పీఈసెట-2023 ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 14న విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో బీపీఈడీ, డీపీఈడీకోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన 'టీఎస్‌ పీఈసెట్-2023' ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 14న విడుదల చేసింది. ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్రంలోని 16 బీపీఎడ్ కాలేజీల్లో 1660 సీట్లు, నాలుగు డీపీఎడ్ కాలేజీల్లో 350 సీట్లను భర్తీ చేయనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. పీఈసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమంట్ ప్రక్రియ సెప్టెంబరు 20 నుంచి 25 వరకు కొనసాగనుంది.

సెప్టెంబ‌ర్ 24 నుంచి 25 వరకు ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ వెరిఫికేష‌న్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు సెప్టెంబ‌ర్ 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవ‌చ్చు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న వారికి సెప్టెంబరు 30న వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం కల్పిస్తారు. ఇక అక్టోబ‌ర్ 3న తొలివిడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబ‌ర్ 4 నుంచి 7 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్‌ తేదీలు: సెప్టెంబరు 20 నుంచి 25 వరకు.

➥ ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థుల‌కు ఫిజిక‌ల్ వెరిఫికేష‌న్: సెప్టెంబరు 24, 25 తేదీల్లో.

➥ వెబ్ ఆప్షన్ల న‌మోదు: సెప్టెంబరు 28, 29 తేదీల్లో. 

➥ వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం: సెప్టెంబరు 30. 

➥ మొదటి విడత సీట్ల కేటాయింపు: అక్టోబ‌ర్ 3న. 

➥ కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: అక్టోబ‌ర్ 4 నుంచి 7 వరకు. 

ALSO READ:

టీఎస్ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల‌, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో బీఈడీ (BEd) కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 14న విడుదల చేసింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేష‌న్‌ సెప్టెంబరు 19న విడుద‌ల చేయ‌నున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎడ్‌సెట్ ప్రవేశాల‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను సెప్టెంబరు 20 నుంచి 30 లోపు న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ వెరిఫికేష‌న్ సెప్టెంబరు 25 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు అక్టోబ‌ర్ 3 నుంచి 5 వ‌ర‌కు వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. అక్టోబ‌ర్ 6న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు అక్టోబ‌ర్ 9న మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబ‌ర్ 10 నుంచి 13 మ‌ధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అక్టోబరు 30 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 15 Sep 2023 07:16 AM (IST) Tags: TSCHE TS PECET 2023 Counselling schedule TS PECET 2023 Counselling Dates TS PECET 2023 Counselling TS PECET 2023 Phase-1 Counselling

ఇవి కూడా చూడండి

AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP ECET: సెప్టెంబరు 25 నుంచి ఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

NEET-MDS: నీట్ ఎండీఎస్‌ కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

NEET-MDS: నీట్ ఎండీఎస్‌ కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

KNRUHS: ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

KNRUHS: ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!

TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!

Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్‌ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా

Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్‌ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా

టాప్ స్టోరీస్

YCP Counter To  Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు

YCP Counter To  Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు

TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్‌

TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్‌

IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్‌.. జయహో శుభ్‌మన్‌! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక

IND vs AUS, 2nd ODI: సాహో శ్రేయస్‌.. జయహో శుభ్‌మన్‌! ఆసీస్‌పై కుర్రాళ్ల సెంచరీ కేక

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!

మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!