అన్వేషించండి

UGC NET - 2023: యూజీసీ నెట్ ఫలితాల వెల్లడి వాయిదా, రిజల్ట్ కొత్త తేది ఇదే!

యూజీసీ నెట్-2023 (UGC-NET) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వాయిదావేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 10న వెలువడాల్సిన ఫలితాలను జనవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

UGC NET December 2023 Results Postponed: యూజీసీ నెట్-2023 (UGC-NET) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వాయిదావేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 10న వెలువడాల్సిన ఫలితాలను జనవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌జాం తుపాను ప్రభావంతో అక్కడి అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా వారికి మరోసారి పరీక్ష నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల యూజీసీ నెట్ ఫలితాలను  జనవరి 17న విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఎన్‌టీఏ జనవరి 9న ఒక ప్రకటనలో తెలిపింది.

UGC NET - 2023: యూజీసీ నెట్ ఫలితాల వెల్లడి వాయిదా, రిజల్ట్ కొత్త తేది ఇదే!

యూజీసీ నెట్-2023 (డిసెంబరు) పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ (UGC NET Answer Key)ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జనవరి 3న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు ప్రశ్నపత్రాలను కూడా అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల నుంచి ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే జనవరి 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించారు. ఇక జనవరి 10న ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా.. జనవరి 17కు వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. తుది ఆన్సర్ కీతోపాటు యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 ఫలితాలను జనవరి 17న వెలువడనున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో డిసెంబర్‌ 6 నుంచి 19 వరకు పలు కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 9,45,918 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే మొత్తం అభ్యర్థుల్లో ఆరు శాతం మందినే నెట్‌ ఉత్తీర్ణులుగా (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) ప్రకటిస్తారు. అదేవిధంగా జేఆర్‌ఎఫ్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీ అభ్యర్థుల ఎంపికలోనూ కనీస అర్హత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణులను ప్రకటించనున్నారు. ఇందుకోసం పలు స్లాట్లలో నిర్వహించనున్న పరీక్షను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా నార్మలైజేషన్‌ ప్రక్రియ చేపడతారు.

నెట్‌తో ప్రయోజనాలెన్నో..

➥ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హోదాతో అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టొచ్చు. యూజీసీ నిబంధనల ప్రకారం-నెట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీలో ఉత్తీర్ణత సాధించిన వారినే ఈ పోస్ట్‌లకు ఎంపిక చేయాలి. ఏడో పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం-అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పే స్కేల్‌ను ప్రారంభంలోనే నెలకు రూ.67 వేలు బేసిక్‌ పే చెల్లించాలని ∙యూజీసీ నిర్దేశించింది.

➥ జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే.. ప్రముఖ రీసెర్చ్‌ లేబొరేటరీల్లో రెండేళ్లపాటు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా, ఆ తర్వాత మరో రెండేళ్లు సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా అవకాశం లభిస్తుంది. 

➥ జేఆర్‌ఎఫ్‌ హోదాలో మొదటి రెండేళ్లు నెలకు రూ.31 వేల ఫెలోషిప్‌ అందుతుంది.

➥ జేఆర్‌ఎఫ్‌ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌కు అర్హత లభిస్తుంది. ఈ దశలో రెండేళ్లపాటు నెలకు రూ.35 వేల స్కాలర్‌షిప్‌ అందుతుంది. 

➥ జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు పూర్తి చేసుకున్నవారు సైంటిస్ట్‌లుగా కెరీర్‌ ప్రారంభించొచ్చు. 

➥ ఐఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఇతర రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో పీహెచ్‌డీ, రీసెర్చ్‌ అభ్యర్థుల ఎంపికలో నెట్‌ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది.

➥ ఆర్ట్స్,హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్‌ సబ్జెక్ట్‌లలో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పురావస్తు శాఖ, ఆర్థిక గణాంక శాఖలు, సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ వంటి పలు ప్రభుత్వ శాఖల్లో రీసెర్చ్‌ స్కాలర్స్‌గా అవకాశాలు లభిస్తాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Embed widget