By: ABP Desam | Updated at : 13 Dec 2021 03:47 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
యూజీసీ నెట్ డిసెంబర్-2021 ఫేజ్-2 పరీక్షలు డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 30 వరకు జరుగుతాయి. కొన్ని కారణాలతో ఫేజ్-1లో రీషెడ్యూల్ చేశారు. అయితే ఆ పేపర్లు కూడా డిసెంబర్ 30న నిర్వహిస్తారు. ఈ మేరకు పరీక్ష తేదీలు విడుదలయ్యాయి.
యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల అర్హత, పీహెచ్డీ ప్రవేశాల కోసం ప్రతి ఏటా నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష ఫేజ్-1 పరీక్షలు ఈమధ్యే పూర్తయ్యాయి. ఫేజ్-2 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. జవాద్ తుపానుతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఫేజ్ 1 పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే వాటిని కూడా నిర్వహించాల్సి ఉంది. ఫేజ్ 1లో మిగిలిన ఏరియాలతో పాటు ఫేజ్ 2 పరీక్షల కోసం కొత్త టైమ్ టేబుల్ విడుదలైంది.
www.nta.ac.inలో ఈ వెబ్ సైటల్ కొత్త షెడ్యూల్ చూసుకోవచ్చు. యూజీసీ నెట్ డిసెంబర్-2021 ఫేజ్-2 పరీక్షలు డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 30 వరకు నిర్వహిస్తారు. లేబర్ వెల్ఫేర్, సోషల్ వర్క్, ఒడియా, తెలుగు సహా ఫేజ్ 1లో రీషెడ్యూల్ చేసిన పేపర్లను 2021 డిసెంబర్ 30న జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉండగా.. రెండో షిప్ట్‌ను మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.
కరోనా కారణంగా డిసెంబర్ 2020 పరీక్షలు వాయిదా పడిని విషయం తెలిసిందే. ఈ కారణంగా జూన్-2021 షెడ్యూల్ ఆలస్యమైంది. డిసెంబర్ 2020, జూన్ 2021 రెండు సెషన్లను విలీనం చేసి ఒకేసారి నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంది.
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సి అంశాలు..
పరీక్షకు వెళ్లే.. అభ్యర్థులు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. ఏవైనా సందేహాలుంటే.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. హెల్ప్ లైన్ 011-40759000 నెంబర్ కు ఫోన్ చేయోచ్చు. పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందు.. యూజీసీ మార్గదర్శకాలను చదువుకోండి. అధికారిక వెబ్ సైట్ లో పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులోకి ఉంటాయి.
Also Read: CTET Exam 2021: సీటెట్ హాల్‌టికెట్ మీకు రాలేదా.. అప్లికేషన్ సరిదిద్దుకోండిలా
Also Read: Online Course: టీసీఎస్ అందిస్తున్న ఈ ఆన్ లైన్ కోర్సు నేర్చుకోండి.. ఎంతో ఉపయోగపడొచ్చు
Also Read: నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్
No Bag Day: విద్యార్థులకు నాలుగో శనివారం 'నో బ్యాగ్' డే! త్వరలో మార్గదర్శకాలు జారీ!
TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!
AP EdCET 2023: జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!
Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
కోలీవుడ్ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్
Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!